‘తెలంగాణలో సమర్థంగా కరోనా నియంత్రణ’
close

ప్రధానాంశాలు

‘తెలంగాణలో సమర్థంగా కరోనా నియంత్రణ’

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనాను సమర్థంగా నియంత్రిస్తోందని శాసనమండలి ప్రొటెం ఛైర్మన్‌ భూపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం లోక్‌సభాపతి ఓం బిర్లా దిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల సభాపతులు, మండలి ఛైర్మన్లతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో భూపాల్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి మాట్లాడారు. ‘‘కరోనాను తెలంగాణ కట్టడి చేస్తోంది. ఇటీవల విధించిన లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ చర్యలతో పెద్దఎత్తున టీకాల కార్యక్రమం నడుస్తోంది. కేంద్రం తెలంగాణకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలి’’ అని భూపాల్‌రెడ్డి కోరారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని