జగతి డిశ్ఛార్జి పిటిషన్‌పై ముగిసిన వాదనలు
close

ప్రధానాంశాలు

జగతి డిశ్ఛార్జి పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో రాంకీ కేసులో జగతి పబ్లికేషన్స్‌ దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌పై గురువారం వాదనలు ముగిశాయి. సీబీఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌.మధుసూదన్‌రావు విచారణ చేపట్టారు. జగతి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ అగర్వాల్‌ వాదనలు వినిపిస్తూ... సీబీఐ ఆరోపణల ప్రకారం గ్రీన్‌బెల్ట్‌ వ్యవహారానికి సంబంధించి అప్పటి ముఖ్యమంత్రితో జరిగిన మూడు సమావేశాల్లో కుట్ర జరిగిందంటున్నారన్నారు. ఈ సమావేశాలు 2005లో జరిగాయని అప్పటికి జగతి పబ్లికేషన్స్‌ ఆవిర్భావమే లేదన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల ప్రకారం ఓ సంస్థ అధికారులను ప్రభావితం చేయలేదని, దీని ప్రకారం అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 9 కింద జగతిపై ఆరోపణలు చేయడం చెల్లవన్నారు. డెల్లాయిట్‌ సుదర్శన్‌ వాల్యుయేషన్‌ నివేదికను పాత తేదీలతో వేశారన్నారని, దీన్ని నేరంగా పరిగణించరాదన్నారు. వాల్యుయేషన్‌ జరిగిన విధానాన్నే పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అంతేగానీ వాల్యుయేషన్‌ను కాదని, అందువల్ల జగతి పబ్లికేషన్స్‌ను కేసు నుంచి తప్పించాలని కోరారు. జగతి వాదనలు ముగిసిన నేపథ్యంలో సీబీఐ వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ కేసుతోపాటు వాన్‌పిక్‌, జగతి పెట్టుబడుల కేసులపై విచారణ జులై 2కు వాయిదా పడింది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని