దర్శకుడు, నటుడు గిరిధర్‌ మృతి

ప్రధానాంశాలు

దర్శకుడు, నటుడు గిరిధర్‌ మృతి

తిరుపతి, న్యూస్‌టుడే: సినీ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్‌ (64) ఆదివారం తిరుపతిలోని ఆయన నివాసంలో మృతిచెందారు. ఆరేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించారు. 1982 నుంచి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా సీనియర్‌ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్‌, ఈవీవీ సత్యనారాయణ వద్ద పనిచేశారు. గుడుంబా శంకర్‌, అన్నవరం, వన్‌, సుప్రీమ్‌, వరుడు వంటి సినిమాలకు కో- డైరెక్టర్‌గా పనిచేశారు. చంద్రమోహన్‌, ఆమని, ఇంద్రజ, వినోద్‌కుమార్‌ ప్రధాన పాత్రధారులుగా శుభముహూర్తం సినిమాకు దర్శకుడిగా చేసి, విజయం అందుకున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రాజా, 100 పర్సంట్‌ లవ్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌, శ్రీమంతుడు వంటి 20 సినిమాల్లో నటించారు. ఇటీవలే   డైరెక్టర్‌ సుకుమార్‌ ఆయన్ను పరామర్శించి వెళ్లారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని