యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణశోభ

ప్రధానాంశాలు

యాదాద్రి విమాన గోపురానికి స్వర్ణశోభ

60 కేజీల బంగారాన్ని సేకరించాలని నిర్ణయం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి గర్భాలయంపై 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన విమానానికి (విమాన గోపురం) బంగారు తాపడం చేయించాలని యాడా నిర్ణయించింది. దీని కోసం సుమారు 60 కేజీల బంగారం అవసరమవుతుందని యాడా, ఆలయ అధికారులు అంచనా వేశారు. దానిని దాతల నుంచి సేకరించాలని నిర్ణయించినట్లు ఆలయ ఈవో గీత సోమవారం తెలిపారు. ఈ మేరకు దాతలు ముందుకు రావాలని ఆమె కోరారు. ఉత్సవ మూర్తుల నిత్య ఉత్సవాలకు వినియోగించే కొయ్య రథానికి స్వర్ణ తొడుగులు అమర్చే పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాగి తొడుగుల తయారీ పూర్తయింది. వాటికి బంగారు తాపడం చేసి టేకు రథానికి అమర్చే పని మిగిలింది. దీనిని పది రోజులలో పూర్తి చేస్తామని ఈ పనులు చేస్తున్న చెన్నైకు చెందిన స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థ వెల్లడించిందని గీత చెప్పారు. ఈ నెలాఖరు లోపు రథం యాదాద్రికి చేరుకునే అవకాశముందన్నారు. స్వర్ణ రథానికి అయ్యే రూ.60 లక్షల ఖర్చును శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్‌ రియల్‌ ఎస్టేట్‌ సంస్థల అధినేతలు సురేశ్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి భరిస్తున్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని