90 ఏళ్ల జడ్పీటీసీ సభ్యురాలు

ప్రధానాంశాలు

90 ఏళ్ల జడ్పీటీసీ సభ్యురాలు

కడప జిల్లాలో గాలివీడు జడ్పీటీసీ సభ్యురాలిగా 90 ఏళ్ల వృద్ధురాలు షేక్‌ బానుబీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గాలివీడు మండలానికి చెందిన వీరిది రాజకీయ కుటుంబం. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యురాలిగా పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బానూబీకి ఒక్క కుమారుడు ఉండగా.. అతను అధిక సంతానం దృష్ట్యా ఎన్నికల్లో పోటీ చేయలేక అమ్మను బరిలోకి దించారు.

-న్యూస్‌టుడే, గాలివీడు


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని