గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్‌ సీఈఓ

ప్రధానాంశాలు

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్‌ సీఈఓ

ఈనాడు, దిల్లీ: నీతిఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌కాంత్‌ రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన ఇక్కడి మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్‌ ఆయనకు తాను రూపొందించిన వృక్షవేదం పుస్తకాన్ని బహూకరించారు. అందులోని విషయాలను పరిశీలించి, యజ్ఞంలా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుండటం తెలుసుకొని సంతోష్‌కుమార్‌ను అమితాబ్‌కాంత్‌ అభినందించారు. ఈ ఉద్యమం ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఇదేవిధంగా ప్రతిఒక్కరూ ముందుకుసాగితే పర్యావరణ మార్పులతో ఎదురవుతున్న సమస్యలను సమర్థంగా ఎదుర్కొనగలమని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తన తరుఫున ఈ సవాల్‌కు ముగ్గుర్ని నామినేట్‌ చేస్తానని చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని