తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

ప్రధానాంశాలు

తల్లి మృతదేహంతో కుమార్తెల ఆందోళన

మ తల్లి లక్ష్మీదేవి (68) మృతదేహాన్ని అనంతపురం జిల్లా బత్తలపల్లి తహసీల్దారు కుర్చీ ఎదురుగా ఉన్న బల్లపై పెట్టి ఆమె ముగ్గురు కుమార్తెలు మంగళవారం ఆందోళన చేసిన సంఘటన ఇది. బత్తలపల్లి మండలం దంపెట్ల రెవెన్యూ పరిధిలోని జలాలపురం గ్రామానికి చెందిన పెద్దన్న పేరుతో సర్వే నంబర్‌ 18డిలో 5.18 ఎకరాల భూమి ఉంది. పెద్దన్న మృతి చెందడంతో తన పేరున పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వాలని ఆయన భార్య లక్ష్మీదేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు నాగేంద్రమ్మ, లింగమ్మ, రత్నమ్మ తిరుగుతున్నారు. లక్ష్మీదేవి కుమార్తె వద్ద ఉంటూ మంగళవారం మృతి చెందింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో తమ తల్లి మానసిక ఆందోళనకు గురై మృతి చెందిందంటూ కుమార్తెలు తల్లి మృతదేహాన్ని తహసీల్దారు కార్యాలయానికి తరలించి నిరసన తెలిపారు. అధికారులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయంపై బత్తలపల్లి తహసీల్దారు ఖతిజున్‌కుఫ్రా మాట్లాడుతూ గ్రామానికి వెళ్లి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు.  -న్యూస్‌టుడే, ధర్మవరం

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని