close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
పీవీ జ్ఞాన భూమిలో స్మృతి మందిరం

ఆగస్టులో లక్నెపల్లిలో విగ్రహం
అక్టోబరులో జాతీయ సదస్సు
ఏపీలోనూ సభ.. జగన్‌కు పిలుపు
పీవీ శతజయంత్యుత్సవాల కమిటీ ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జ్ఞానభూమిలో స్మృతి మందిరాన్ని నిర్మించాలని పీవీ శతజయంత్యుత్సవ కమిటీ నిర్ణయించింది. దీని కోసం నాలుగు నమూనాలను సిద్ధం చేసింది. సీఎం ఆమోదం తీసుకొని.. సుప్రీంకోర్టు నియమాలను అనుసరిస్తూ జూన్‌ 2021 కల్లా పూర్తి చేయాలని భావిస్తోంది. పీవీ జన్మించిన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామంలో ఆయన విగ్రహాన్ని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా ఆగస్టులో ఆవిష్కరించనున్నట్లు కమిటీ ఛైర్మన్‌ కేశవరావు తెలిపారు. అక్టోబరులో హైదరాబాద్‌లో ఓ సదస్సు ఏర్పాటు చేసి... ముఖ్యఅతిథులుగా ప్రణబ్‌ముఖర్జీ, మన్మోహన్‌సింగ్‌, శశిథరూర్‌లను పిలుస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ సభ ఏర్పాటు చేసి...ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు. పీవీ వర్ధంతి రోజు రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ను పిలుస్తామన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో కేకే అధ్యక్షతన పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది. అవి.. ‘‘విదేశాల్లో, దేశంలోని ఏడు రాష్ట్రాల్లో పీవీ విగ్రహాలను ఆవిష్కరించాలి. సదస్సులను నిర్వహించి ముఖ్యఅతిథులుగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌, ఒబామాలను ఆహ్వానించాలి. ప్రతి నెలా విధిగా ఒక కార్యక్రమం నిర్వహించాలి. దీని కోసం ఉపకమిటీలు ఏర్పాటు చేయాలి. ఆగస్టులో ‘భూమి పుత్రుడికి నీరాజనం’ పేరిట వంగరలో ఓ కార్యక్రమం. సెప్టెంబరులో కళాకారుల వర్క్‌షాపులు, ఎగ్జిబిషన్లు. అక్టోబరులో విజయవాడ, విశాఖల్లో ‘తెలుగు ప్రజల నీరాజనం’ సదస్సు. నవంబరులో సాహితీ - సాంస్కృతిక నీరాజనం పేరిట కవి సమ్మేళనాలు, సాహితీ సమావేశాలు. డిసెంబరులో వర్ధంతి సందర్భంగా జాతీయస్థాయి సదస్సులు. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాజధానుల్లో కార్యక్రమాలు చేపట్టాలి. పీవీకి భారతరత్న, పార్లమెంట్‌లో విగ్రహం గురించి రానున్న శాసనసభ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించాలి. శాసనసభలో పీవీ చిత్రపటాన్ని ఆవిష్కరించాలి’ అని ప్రతిపాదించారు. సమావేశంలో మంత్రి కేటీఆర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య, సాంస్కృతిక సలహాదారులు రాజీవ్‌శర్మ, రమణాచారి, పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, కుమార్తె వాణిదేవి, దేశపతి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

వెబ్‌సైట్‌ ప్రారంభం: పీవీ శతజయంత్యుత్సవాల సమాచారం వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఐటీ శాఖ రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్‌ https:pvnr.telangana.gov.in ను కేకే ప్రారంభించారు. దీని గురించి మంత్రి కేటీఆర్‌ వివరించారు. పీవీ శతజయంతి కమిటీ సమావేశాలు, నిర్వహించే కార్యక్రమాలు, వేదికలు, ఫొటోలు, వీడియోలు, సామాజిక మాధ్యమాల ఖాతాలు, వార్తలు, విశ్లేషణలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిర్ణయాలు వంటి సమాచారాన్ని ఇందులో పొందుపరుస్తారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.