close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వ్యర్థం ఎరువైంది.. నిర్వహణలో ఆదర్శమైంది

ట్టణాల్లో భారీగా పోగవుతున్న కూరగాయల వ్యర్థాలతో కొన్నిచోట్ల విద్యుత్తు తయారు చేస్తుండగా.. సంగారెడ్డి మున్సిపాలిటీ ఎలాంటి ఖర్చు లేకుండా సేంద్రియ ఎరువుగా మారుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం ఓ ఉద్యోగిని నియమించి.. నైట్రోజన్‌, పాస్ఫరస్‌, కాల్షియం విలువలు కలిగిన 15 టన్నుల ఎరువును ప్రతి నెలా తయారు చేస్తోంది. ‘విండ్రో కంపోస్ట్‌’గా పిలిచే ఈ ఎరువుని హరితహారం మొక్కలు, నర్సరీలు, పంట పొలాలకు వినియోగిస్తున్నారు. పట్టణంలోని 4 కూరగాయల మార్కెట్లలో ప్రతిరోజు 1-2 టన్నుల కుళ్లిన కూరగాయలు లభిస్తున్నాయి. ఈ వ్యర్థాలను సేకరించి మూడు రోజులు ఆరబెడతారు. తర్వాత నేలపై ఎండిన ఆకులు పేర్చి పేడనీళ్లు చల్లి ఆపైన సుమారు రెండు అడుగుల మేర కూరగాయల వ్యర్థాలు వేసి ఆకులతో కప్పుతారు. పది రోజులకు మరో వరస కుళ్లిన కూరగాయలు, పైన ఆకులు వేస్తారు. ఇలా 40 రోజుల్లో 4 వరుసల్లో ఆకులు, కూరగాయల వ్యర్థాలు పేర్చాక... పైన గోనెసంచులు కప్పి నిత్యం నీళ్లు చల్లుతారు. తర్వాత బెడ్‌ను కుప్పలా చేసి నీటితో తడుపుతూ కలియతిప్పుతూ ఎరువుగా మారుస్తున్నారు.  

- ఈనాడు, సంగారెడ్డి

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు