close

రాశి ఫలం

గ్రహబలం (ఫిబ్రవరి 9 - 15)
డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


బ్రహ్మాండమైన శుభకాలం నడుస్తోంది. పనులు త్వరగా పూర్తవుతాయి. లక్ష్యసాధనలో విజయం వరిస్తుంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. దైవబలం విశేషంగా రక్షిస్తోంది. ఆకర్షించే విధంగా మీ మాటతీరు ఉండాలి. ఎదురుచూస్తున్న ఓ ఫలితం అనుకూలంగా వస్తుంది. ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి. ప్రతిభతో ఖ్యాతి గడిస్తారు. ఇష్టదైవాన్ని స్మరించండి.


మనోబలంతో లక్ష్యం సిద్ధిస్తుంది. శ్రమ ఫలిస్తుంది. ఆర్థికంగా విజయం లభిస్తుంది. పట్టుదలతో ఆలోచించండి. సమష్టిగా చేసే పనులు త్వరగా లాభాన్నిస్తాయి. రుణభారం పెరగరాదు. మొహమాటంతో ఒకటి చేయబోయి వేరొకటి చేసే ప్రమాదముంది. ప్రయాణాల్లో జాగ్రత్త. శాంతంగా సంభాషించండి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.


దైవబలంతో పనులు పూర్తి అవుతాయి. విజయం లభిస్తుంది. ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలను బుద్ధిబలంతో అధిగమించండి. సొంత నిర్ణయాలు వద్దు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. శాంత స్వభావంతో మాట్లాడండి. ఖర్చులు అదుపుచేయాలి. ధనలాభం ఉంది. ప్రతి పనీ ఇంట్లోవారితో చెప్పి చేయండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


పట్టుదలతో పనిచేస్తే శీఘ్ర విజయముంటుంది. ఏకాగ్రచిత్తంతో ఆలోచించాలి. దైవబలం ఉంది. దేనికీ తొందర వద్దు. ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. సున్నితమైన అంశాల్లో తెగేదాకా లాగవద్దు. భూ లాభముంది. వ్యాపారంలో విజయాలున్నాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలతో ఒత్తిడి ఉండదు. అపార్థాలకు తావివ్వకండి. శివధ్యానం మంచిది.


అదృష్టయోగముంది. బుద్ధిబలంతో అభివృద్ధిని సాధిస్తారు. గొప్ప విజయం ఒకటి సొంతమవుతుంది. ఏకాగ్రతతో ఆలోచించాలి. అవసరాలకు ధనం లభించినా, తెలియకుండానే ఖర్చు పెరుగుతుంది. అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. పొరపాటు జరగకుండా జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. గణపతి ఆరాధన చేయాలి.


వ్యాపారయోగం అనుకూలిస్తుంది. నిండు మనసుతో పని మొదలుపెట్టాలి. విజయం సిద్ధించే వరకూ పనిని మధ్యలో ఆపరాదు. ఆర్థిక పుష్టి పెరుగుతుంది. పట్టుదల అవసరం. మంచి భవిష్యత్తు లభిస్తుంది. ప్రయత్నాన్ని బట్టి ఫలితముంటుంది. వివాదాలు సృష్టించేవారున్నారు. శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం చదవాలి.


మిశ్రమకాలం నడుస్తోంది. ధైర్యంగా, ధర్మంగా పనులు ప్రారంభించండి. శాంతచిత్తం అవసరం. ఆచితూచి ఖర్చుచేయాలి. పనులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. చివరి నిమిషంలో మేలు జరుగుతుంది. మీ మనోబలం ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సలహాలతో ఆపద తొలగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. లక్ష్మీదేవి ఆరాధన మంచిది.


ఉత్తమ కాలమిది. శుభాలు జరుగుతాయి. మానసిక దృఢత్వం అవసరం. దైవబలం సహకరిస్తోంది. సునాయాసంగా సమస్యలను పరిష్కరించే అవకాశముంది. శత్రువులు మిత్రులవుతారు. సుఖశాంతులున్నాయి. నిదానంగా సంభాషించండి. అపార్థాలకు ఆస్కారముంది. ప్రతి అడుగూ వ్యక్తిగత అభివృద్ధి వైపే వేయాలి. ఇష్టదైవారాధన ఉత్తమం.


ఆర్థికాంశాలు బాగుంటాయి. రుణ సమస్య పెరగకుండా జాగ్రత్తపడాలి. పనిలో చంచలత్వం వద్దు. సాధన అవసరం. వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. గతానుభవంతో వ్యవహరించండి. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా చేయాలి. ఆటంకాలున్నాయి. కుటుంబసభ్యుల సూచనలు అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించండి.


సాహసోపేత నిర్ణయాలు విజయాన్నిస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధుత్వాల విషయంలో   పట్టింపులు వద్దు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఉద్యోగంలో బాధ్యతాయుతంగా పనిచేసి లాభపడతారు. వ్యాపారంలో విశేష లాభముంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్టదైవాన్ని స్మరించండి.


శ్రేష్టమైన కాలం నడుస్తోంది. మంచి పనులతో అభివృద్ధిని సాధిస్తారు. అదృష్టఫలాలు అందుతాయి. భవిష్యత్తుకు అవసరమైన ధనాన్ని ఇప్పుడే సమకూర్చుకోవాలి. భవిష్యత్తులో సమస్యలు రాకుండా చూసుకోండి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. నిర్మలమైన మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధైర్యం అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. విష్ణుస్మరణ మంచిది.


అనుకూల ఫలితాలున్నాయి. గృహ, భూ సౌభాగ్యాలుంటాయి. అభీష్టసిద్ధి కలుగుతుంది. సకాలంలో పనులు చేసి ప్రశంసలు పొందుతారు. కుటుంబపరంగా ప్రోత్సాహం ఉంటుంది. స్వయంగా అభివృద్ధిని సాధించే కాలమిది. ఉపద్రవం నుంచి బయటపడతారు. పట్టుదలతో పైకి వస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభవార్త వింటారు. శివారాధన మేలు చేస్తుంది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.