Weekly Horoscope: రాశిఫలం - Sunday Magazine
close

Weekly Horoscope: రాశిఫలం

గ్రహబలం (జూన్‌ 27 - జులై 3)

డా।। శంకరమంచి రామకృష్ణ శాస్త్రి


విశేషమైన శుభాలుంటాయి. ఉద్యోగంలో అనుకూల కాలం నడుస్తోంది. గృహయోగం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిపూర్ణమైన ఫలితాలు అందుతాయి. ఆవేశానికి దూరంగా ఉండాలి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని స్మరిస్తే మంచిది.


ముఖ్యకార్యాల్లో విజయం లభిస్తుంది. ఏకాగ్రతతో కార్యసిద్ధి. ఒత్తిడి కలగకుండా పని పూర్తిచేయండి. ఆర్థికాంశాలు అనుకూలిస్తాయి. సమస్యల నుంచి త్వరగా బయటపడతారు. ఉద్యోగపరంగా మిశ్రమ కాలం నడుస్తోంది. మితభాషణం మంచిది. అపార్థాలకు అవకాశముంది. ఇష్టదైవస్మరణ మేలుచేస్తుంది.


అదృష్టకాలం కొనసాగుతోంది. లక్ష్యంవైపు అడుగులు వేయండి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారపరంగా అనుకూల ఫలితముంటుంది. బుద్ధిబలంతో ఆపదలు తొలగుతాయి. ఉత్తమ భవిష్యత్తు దిశగా ప్రణాళికలు వేసుకునే కాలమిది. బంధుమిత్రుల సహకారాన్ని తీసుకోండి. వారం మధ్యలో ఒక పనిలో విజయముంటుంది. ఆదిత్య హృదయం చదివితే మంచి జరుగుతుంది.


మనోభీష్టసిద్ధి ఉంది. వ్యాపార లాభం సూచితం. ఆర్థికంగా అనుకూల కాలం నడుస్తోంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తెలియని విషయాల్లో తల దూర్చవద్దు. ఓర్పు రక్షిస్తుంది. పట్టుదలతో అనుకున్నది సాధించాలి.మిత్రుల సలహాలు అవసరం. సమష్టి కృషితో లాభాలుంటాయి. ఒక సమస్య తొలగుతుంది. సూర్యస్తుతి మంచిది.


ఉద్యోగఫలాలు అనుకూలం. లక్ష్యం సిద్ధిస్తుంది. సుఖసంతోషాలున్నాయి. వ్యాపారలాభం ఉంది. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పెద్దల అండదండలుంటాయి. అభ్యుదయ భావాలతో పనిచేసి ఆదర్శంగా నిలుస్తారు. లక్ష్మీధ్యానం సదా రక్షిస్తుంది.


ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంది. మిత్రుల వల్ల మేలు చేకూరుతుంది. మీవల్ల కొందరికి సహాయం అందుతుంది. నమ్మకంతో ముందడుగు వేస్తారు. ఆనందించే అంశాలున్నాయి. కుటుంబసభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. శివారాధన ఉత్తమం.


ఆలోచించి అడుగేయాలి. కొన్ని సంఘటనలు ఇబ్బందిపెడతాయి. జాగ్రత్తగా పరిష్కరించాలి. ఉద్యోగంలో గతానుభవం తోడ్పడుతుంది. పురోగతి సాధించే క్రమంలో ఓర్పు అవసరం. వ్యాపారంలో శ్రద్ధ పెంచండి. ముఖ్యకార్యాలను వాయిదా వేయండి. వివాదాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి. నవగ్రహ స్తోత్రపఠనం శుభప్రదం.


ఉద్యోగంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ధనలాభం ఉంటుంది. ఎదురుచూస్తున్న పని వెంటనే పూర్తవుతుంది.  అదృష్ట ఫలాలు అందుతాయి. ప్రతీదీ లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. స్థిరాస్తి ఉన్నతస్థితినిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి పనిచేయండి. ఇష్టదైవాన్ని స్మరించండి. శాంతి లభిస్తుంది.


ఉన్నతాశయాలతో ముందుకు సాగండి.  వ్యాపారబలం పెరుగుతుంది. బ్రహ్మాండమైన ఫలితం ఒకటి లభిస్తుంది. గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. అధికారుల ప్రశంసలున్నాయి. సమష్టి కృషితో అనుకున్నది సాధిస్తారు. వారం మధ్యలో ఆనందించే అంశముంది. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది.


అభీష్టసిద్ధి ఉంటుంది. చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం అనుకూలంగా ఉంది. వ్యాపారఫలం మిశ్రమం. శ్రద్ధ పెంచాలి. వారం మధ్యలో అదృష్టయోగం సూచితం. స్వయంకృషితో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు. ఒక ఆపద నుంచి బయటపడతారు. ఇష్టదైవాన్ని ధ్యానించండి, ప్రశాంతత లభిస్తుంది.


కార్యసిద్ధి ఉంది. ఉత్సాహంగా పనులు మొదలుపెట్టండి. ఆశయం నెరవేరుతుంది. ఉద్యోగరీత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలు ఉంటాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మిత్రుల సలహాలతో విఘ్నాలను అధిగమించాలి. ప్రసన్నంగా ఉండాలి. పెద్దల ఆశీర్వచనం లభిస్తుంది. ఆరోగ్య పరిరక్షణ అవసరం, ఆదిత్యస్తుతి మేలు చేస్తుంది.


శుభయోగాలున్నాయి. కోరుకున్న ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి. వ్యాపారంలో లాభముంటుంది. పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఉన్నతమైన జీవితం ఏర్పడుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భారీ లక్ష్యాల దిశగా నడిపిస్తాయి. ఒక సమస్య పరిష్కారమవుతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలి. లక్ష్మీస్తుతి మనశ్శాంతిని ఇస్తుంది.

Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న