బీటు మార్చే యాప్‌లు
close

Updated : 07/07/2021 16:35 IST
బీటు మార్చే యాప్‌లు

ఫోన్‌లో రోజూ పలు రకాల మ్యూజిక్‌ ట్రాక్స్‌ వింటుంటాం. వాటిల్లో మెలోడీ పాటలు కొన్నయితే.. పాప్‌ ట్రాక్స్‌ ఇంకొన్ని. ఏది వింటున్నప్పటికీ సరైన ‘బేస్‌’ లేకుంటే మజా ఉండదు. అలాంటప్పుడు బేస్‌ని కాస్త పెంచుకుందాం అనుకుంటే.. బిల్ట్‌ఇన్‌గా ఉన్న మ్యూజిక్‌ ప్లేయర్‌కి కొన్ని థర్డ్‌పార్టీ యాప్‌లను వాడితే మంచిది. ఆశించిన అవుట్‌పుట్‌తో బేస్‌ని పెంచుకుని వినొచ్చు. అందుకు తగిన ‘ఈక్వలైజర్‌’ యాప్‌లు ఇవిగోండి..

సరికొత్త అప్‌డేట్‌లతో... (Bass Booster & Equalizer)

బేస్‌తో పాటు దీంట్లో ఇతర సౌండ్‌ ఎఫెక్ట్‌లను కూడా మార్చొచ్చు. అందుకే దీన్ని ‘ఆల్‌ ఇన్‌ వన్‌’ యాప్‌గా మ్యూజిక్‌ ప్రియులు పిలుస్తున్నారు. ఉచిత కేటగిరిలో ఎక్కువ మంది ఆండ్రాయిడ్‌ యూజర్లను ఆకట్టుకుంది. బేస్‌ బూస్ట్‌ ఎఫెక్ట్, స్టీరియో సరౌండ్‌ ఎఫెక్ట్, ఫైవ్‌-బ్యాండ్‌ ఈక్వలైజర్‌.. ప్లేయర్‌లో అదిరే మ్యూజిక్‌ని అందిస్తాయి. నచ్చిన ఎఫెక్ట్‌లతో ‘యూజర్‌ ప్రీసెట్స్‌’గా క్రియేట్‌ చేసుకోవచ్చు. 

‘బూస్ట్‌’ చేయొచ్చు (Bass Booster)

ఆండ్రాయిడ్‌లో ఎక్కువ శాతం మంది బేస్‌ని పెంచుకునేందుకు వాడుతున్న యాప్‌. ప్లేయర్‌లో ఈక్వలైజర్స్‌ని వాడుకుని కావాల్సినట్టుగా బేస్‌లో మార్పులు చేయొచ్చు. ఇలా మార్పులు చేసిన ప్లేయర్‌ సెట్టింగ్స్‌ని ‘కస్టమ్‌ ఈక్వలైజర్‌ ప్రీసెట్స్‌’గా సేవ్‌ చేసుకునే వీలుంది. యాప్‌ ప్రో వెర్షన్‌లో మరిన్ని ఫీచర్స్‌ని పొందొచ్చు. 

‘ఐపాడ్‌’లా అనిపిస్తుంది (Bass Booster)

యాపిల్‌లో కనిపించే మ్యూజిక్‌ ప్లేయర్‌ని పోలి ఉంటుంది. హోం థియేటర్‌ ఎఫెక్ట్‌తో పాటల్ని ప్లే చేస్తుంది. సులువైన ఇంటర్ఫేస్‌తో వాడుకునేలా బేస్‌, ఈక్వలైజర్, బ్యాలెన్స్‌.. వీల్స్‌ ఉన్నాయి. ఫోన్‌లోని అన్ని ట్రాక్స్‌ని వినేందుకు డీఫాల్ట్‌ మ్యూజిక్‌ ప్లేయర్‌లా దీన్ని సెట్‌ చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లోనూ ‘ట్యూనింగ్‌’.. (SpotiQ)

పేరులో ఉన్నట్టుగానే ఇదో ప్రత్యేక ఆడియో ఈక్వలైజర్‌. ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సర్వీసైన స్పూటిఫైని ఇది సపోర్టు చేస్తుంది. పాటల్ని వినే క్రమంలో సౌండ్‌ క్వాలిటీని నచ్చినట్టుగా మార్పులు చేసుకోవచ్చు. బేసిక్‌ వెర్షన్‌ని ఉచితంగా వాడుకోవచ్చు. ప్రీమియం వెర్షన్‌లో మరిన్ని ఆప్షన్స్‌ని యాక్సెస్‌ చేయొచ్చు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న