Sunday Tip: ఐఫోన్‌లో వీడియోల సైజ్‌ తగ్గించండిలా!
close

Updated : 19/09/2021 17:18 IST
Sunday Tip: ఐఫోన్‌లో వీడియోల సైజ్‌ తగ్గించండిలా!

ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్ ఫోన్లలో ఉత్తమైన క్వాలిటీతో వీడియోలు తీయొచ్చంటే ముందుగా గుర్తొచ్చేది ఐఫోన్. ఇందుకోసం ఫోన్‌ కెమెరాలలో ప్రత్యేక ఫీచర్స్‌ ఇస్తోంది యాపిల్. కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 13లో కూడా సినిమాటిక్‌ వీడియో రికార్డింగ్, ప్రో మోషన్ కంట్రోల్‌, ప్రోరెస్‌ వీడియో వంటి ఫీచర్లున్నాయి. అయితే ఈ ఫీచర్స్‌తో రికార్డ్, ఎడిట్ చేసిన వీడియోలు సైజ్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఈ-మెయిల్స్‌కి అటాచ్‌ చేసి పంపడం యూజర్స్‌కి సాధ్యపడటంలేదు. అయితే వీడియోలసైజ్ తగ్గించేందుకు ఐఫోన్‌లలో వీడియో కంప్రెస్ ఫీచర్‌ లేదు. మరి ఐఫోన్‌లో రికార్డ్‌ చేసి, ఎడిట్ చేసిన వీడియోల క్వాలిటీ తగ్గకుండా ఎలా కంప్రెస్ చేయాలనేది తెలుసుకుందాం. 

ఐఫోన్ యూజర్స్ వీడియోల సైజ్ తగ్గించేందుకు థర్డ్‌ పార్టీ యాప్‌లపై ఆధారపడాల్సిందే. వాటిలో టెక్‌ నిపుణులు సూచిస్తున్న యాప్‌ ‘వీడియో కంప్రెస్‌ యాప్‌’. 

ఈ యాప్‌ని ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత అందులో ‘+’ సింబల్‌పై క్లిక్ చేయాలి. 

తర్వాత ఫోన్‌లోని ఫొటోస్ యాప్‌ యాక్సెస్‌ కోరుతుంది. దాన్ని ఓకే చేశాక, మీకు ఫోన్‌లోని వీడియోలు జాబితా రూపంలో కనిపిస్తాయి. 

వాటిలో మీరు సైజ్ తగ్గించాలనుకుంటున్న వీడియోపై క్లిక్ చేయాలి. తర్వాత మీకు వీడియో క్వాలిటీకి సంబంధించిన ఆప్షన్లు కనిపిస్తాయి. ఫుల్‌-హెచ్‌డీ క్వాలిటీ సైజ్‌ 28.6 ఎంబీ నుంచి 360పీ క్వాలిటీ వీడియో సైజ్‌ 3.6 ఎంబీ వంటి ఆప్షన్లు ఉంటాయి. 

మీకు కావాల్సిన వీడియో క్వాలిటీపై క్లిక్ చేస్తే వీడియో సేవ్‌ చేయాల్సిన చోటును ఎంపిక చేయమని అడుగుతుంది. తర్వాత ఫోల్డర్‌ ఎంపిక చేసి ఓకే క్లిక్ చేస్తే కేవలం 30 సెకన్లలో ప్రాసెస్‌ పూర్తవుతుంది. 

చివర్లో ఒరిజినల్ వీడియో ఉంచాలా.. డిలీట్ చేయాలా అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఒరిజినల్ వీడియో కావాలనుకుంటే కీప్‌ ది ఒరిజినల్‌ వీడియో ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అవసరంలేదనుకుంటే డిలీట్ ఆప్షన్‌ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది.

వీడియో కంప్రెస్‌ చేసేందుకు థర్డ్‌ పార్టీ యాప్‌లు వద్దనుకుంటే యూజర్స్‌కి మరో ఆప్షన్ ఉంది. అదే లో క్వాలిటీ వీడియో రికార్డింగ్ ఆప్షన్‌. ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కెమెరాపై క్లిక్ చేస్తే రికార్డ్‌ వీడియో అనే ఆప్షన్‌ ఉంటుంది. అందులో వేర్వేరు వీడియో క్వాలిటీ ఆప్షన్లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుని వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న