ఉమంగ్‌లోనూ మ్యాప్‌ సేవలు
close

Updated : 21/07/2021 05:09 IST
ఉమంగ్‌లోనూ మ్యాప్‌ సేవలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ సేవలను ఒకే దగ్గర అందించే ఉమంగ్‌ యాప్‌ వినియోగదారులకు శుభవార్త. ఇకపై ఇందులో దగ్గర్లోని బ్లడ్‌బ్యాంకులు, ఈఎస్‌ఐ ఆసుపత్రులు, మండీలు, పోలీస్‌ స్టేషన్ల వంటి వాటి వివరాలూ తెలుసుకోవచ్చు. మ్యాప్‌మైఇండియాతో అనుసంధానమై ఇది పనిచేస్తుంది. ఇందులో గ్రామాలు, వీధుల మ్యాపులను సవివరంగా చూసుకోవచ్చు. ఆయా ప్రాంతాలకు ఎంతసేపట్లో, ఎలా వెళ్లొచ్చో తెలుసుకోవచ్చు. ఇది మాట రూపంలోనూ దారిని వివరిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు ట్రాఫిక్‌, రోడ్డు భద్రత సమాచారాన్నీ తెలియజేస్తుంది. ఎక్కడైనా రోడ్డు దెబ్బతిన్నట్టు గమనిస్తే మ్యాపులో దాన్ని ఎంచుకొని యాప్‌ నుంచే ఫిర్యాదు చేసే అవకాశమూ ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న