close

Updated : 17/03/2021 19:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
Tech10: పోకో X‌3ప్రో.. మోటో G100.. (16/03/2021)


1. పోకో ఎక్స్‌3 ప్రో ఫస్ట్‌ లుక్‌

పోకో నుంచి చాలా రోజుల తర్వాత కొత్త ఫోన్‌ రాబోతోంది. గతేడాది సెప్టెంబరులో వచ్చిన ‘పోకో ఎక్స్‌ 3’కి అప్‌గ్రేడెడ్‌ వెర్షన్‌గా ‘పోకో ఎక్స్‌3 ప్రో’ను తీసుకొస్తున్నారు. ఈ  నెల 30న కొత్త మొబైల్‌ లాంచ్‌ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు లీక్‌ అయ్యాయి. వాటి ప్రకారం చూస్తే... పోకో ఎక్స్‌3 డిజైన్‌లోనే కొత్త మొబైల్‌ ఉండబోతోంది. అయితే స్పెసిఫికేషన్లలో కొన్ని మార్పులు ఉంటాయి. ఇందులో వెనుకవైపు నాలుగు కెమెరాల సెటప్‌లో 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 860 చిప్‌సెట్‌ ఉంటుంది. 120 హెడ్జ్‌ ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే ఉండొచ్చు. 5,200 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది.


2. టెలీగ్రామ్‌లో ‘క్లబ్‌హౌస్‌’

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ ‘క్లబ్‌ హౌస్‌’. ఆడియోల రూపంలో చాట్‌ చేసుకోగలగడం ఈ యాప్‌ ప్రత్యేకత. ఆడియో చాట్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకొని, ఇంటర్వ్యూలు, సంభాషణలు చేయగలగడం ఈ యాప్‌ ప్రత్యేకత. సులభంగా చెప్పాలంటే బొమ్మ లేకుండా వీడియో అన్నమాట. ఈ యాప్‌/సర్వీసుకు దక్కుతున్న ఆదరణతో చాలా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే ట్విటర్‌ ఆడియో మెసేజ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. తాజాగా టెలీగ్రామ్‌ కూడా ఈ తరహా ఫీచర్‌ను టెస్ట్‌ చేస్తోంది. త్వరలో క్లబ్‌హౌస్‌ తరహాలో టెలీగ్రామ్‌లోనూ వాయిస్‌ చాట్స్‌, డిస్కషన్స్‌ చేయొచ్చన్నమాట.


3. రియల్‌మీ 8 వీడియో వచ్చేసింది

మరో వారంలో మొబైల్‌ లాంచ్‌ అవుతుంది అంటే... స్పెసిఫికేషన్లు లీక్‌ అవ్వడం సహజం. అయితే ఈసారి అన్‌బాక్సింగ్‌ వీడియో ఒకటి బయటికొచ్చేసింది. ఈ నెల 24న లాంచ్‌ చేయనున్న రియల్‌మీ 8  ప్రో అన్‌బాక్సింగ్‌ వీడియో అది. దాని ప్రకారం చూస్తే... ఈ మొబైల్‌లో 108 ఎంపీ మెయిన్‌ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా మరో మూడు కెమెరాలు ఉంటాయి. రియల్‌మీ 2.0 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుంది. టైప్‌సీ ఛార్జింగ్‌ పోర్టు ఇస్తున్నారు. సూపర్‌ డార్ట్‌ ఛార్జర్‌ ఉండబోతోంది.


4. వాటితో పోలిస్తే వేగం తక్కువట

5జీ, 4జీ నెట్‌వర్క్‌ల వేగం విషయంలో అమెరికాకు చెందిన ఓపెన్‌ సిగ్నల్‌ తాజా నివేదిక విడుదల చేసింది. అందులో భాగంగా ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్లతో పోలిస్తే.. ఐఫోన్లలో నెట్‌వర్క్‌ వేగం తక్కువని ప్రకటించింది. ఐఫోన్‌ 12 సిరీస్‌ మొబైల్స్‌ కంటే శాంసంగ్‌, వన్‌ప్లస్‌, గూగుల్‌, ఎల్‌జీ మొబైల్స్‌లో 5జీ, 4జీ వేగం ఎక్కువగా ఉందని తేల్చింది. మొత్తంగా చూస్తే శాంసంగ్‌ మొబైల్స్‌లో 5జీ వేగం ఎక్కువని ఓపెన్‌ సిగ్నల్‌ తెలిపింది. శాంసంగ్‌తో పోలిస్తే యాపిల్‌ మొబైల్స్‌ స్పీడ్‌ 18 శాతం తక్కువని ఓపెన్‌ సిగ్నల్‌ తెలిపింది. యాపిల్‌ మొబైల్స్‌లో 5జీ స్పీడ్‌ 44.5 ఎంబీపీఎస్‌ కాగా, 4జీ స్పీడ్‌ 18.9 ఎంబీఎస్‌గా ఉంది. అదే శాంసంగ్‌లో అయితే 5జీ వేగం 54 ఎంబీపీఎస్‌ ఉంది. 4జీ స్పీడ్‌ 34 ఎంబీపీఎస్‌గా ఉందట.


5. శాంసంగ్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు

శాంసంగ్‌ నుంచి త్వరలో రెండు కొత్త మొబైల్స్‌ రానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు వస్తున్న పుకార్ల ప్రకారం అయితే అవి శాంసంగ్‌ గెలాక్సీ A52 5జీ, A72 5జీ. దీనిపై సంస్థ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికీ.. ఇటీవల ఈ మొబైల్స్‌ ప్రచారం కోసం సిద్ధం చేసిన మెటీరియల్‌ బయటకు వచ్చింది. వాటి ప్రకారం చూస్తే... ముందుగా వచ్చిన లీక్‌లు నిజయమ్యేలా ఉన్నాయి. ఈ నెల 17న ఈ మొబైల్స్‌ లాంచ్‌ చేయనున్నారు. ఏ72లో 3ఎక్స్‌ జూమ్‌ ఉండబోతోంది. ఏ 52లో 64 ఎంపీ మెయిన్‌ కెమెరా ఇస్తున్నారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఉంటుంది. ఈ మొబైల్‌ స్క్రీన్‌ సైజ్‌ 6.5 అంగుళాలు ఉంటుంది. ఇక ఏ 72లో అయితే 6.7వ అంగుళాల స్క్రీన్‌ ఇస్తున్నారు. ఐపీ67 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెంట్‌ ఫీచర్‌ ఉంది.


6. ఎడ్జ్‌ S.. జీ100 అవుతోందా?

మోటోరోలా గతేడాది ఫ్లాగ్‌షిప్‌ రేంజీలో భాగంగా మోటో ఎడ్జ్‌ ప్లస్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. అందులో తక్కువ ధర, మంచి ఫీచర్లు ఉండేలా మోటో ఎడ్జ్‌ ఎస్‌ను తీసుకొస్తోంది. చైనాకు మాత్రమే పరిమితం అని చెప్పిన ఎడ్జ్‌ ఎస్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లోకి వేరే పేరుతో తీసుకొస్తున్నారట. ‘మోటో జీ 100’ పేరుతో ఈ మొబైల్‌ తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ నెల 25న ఈ ఈవెంట్ ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం... ఈ మొబైల్‌లో 6.7 అంగుళాల 90 హెర్జ్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ ఇస్తున్నారు. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్‌లో 64 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తారు.


7. సిగ్నల్‌లోనూ ట్రాన్స్‌ఫర్‌ చేయొచ్చు

వినియోగదారులకు మెసేజింగ్‌ యాప్‌ సిగ్నల్‌ తీపికబురు చెప్పింది. మొబైల్ మార్చేటప్పుడు అందులోని సిగ్నల్‌ యాప్‌లోని ఛాట్స్‌ను కొత్త మొబైల్‌కు భట్వాడా చేసే సదుపాయాన్ని త్వరలో ఇవ్వబోతోంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో కొంతమందికి  ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ వచ్చింది. ‘ప్రైవేట్‌‌ వైఫై డైరెక్ట్‌ కనెక్షన్‌’ ఫీచర్‌ ద్వారా పాత మొబైల్‌ నుంచి కొత్త మొబైల్‌లోకి సిగ్నల్‌ చాట్స్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఆ మెసేజ్‌లు ఎన్‌క్రిప్టెడ్‌గానే ఉంటాయని సిగ్నల్‌ చెబుతోంది. సిగ్నల్‌ యాప్‌లోని సెట్టింగ్స్‌లో ‘ట్రాన్స్‌ఫర్‌ అకౌంట్‌’ ఆప్షన్‌ ద్వారా ఈ ఫీచర్‌ను పొందొచ్చు. త్వరలోనే ఈ ఆప్షన్‌ యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుంది.


8. నోకియా కొత్త ఫోన్‌ ఎంతంటే?

బడ్జెట్‌ ధరలో మొబైల్స్‌ తీసుకొస్తూ.. యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది నోకియా. ఈ క్రమంలో  తాజాగా  ‘జీ 10’ పేరుతో ఓ మొబైల్‌ తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన ధర తదితర వివరాలు బయటికొచ్చాయి. ₹12 వేల ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తుందట. 3జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా ఉండబతోంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. వచ్చే నెల 8న జరిగే గ్లోబల్‌ ఈవెంట్‌లో ఈ మొబైల్‌ లాంచ్‌ చేస్తారని భోగట్టా. అదే రోజు  ఈమొబైల్‌తోపాటు మరో రెండు ఫోన్లు కూడా ఆవిష్కరించే అవకాశం ఉందట. అవి నోకియా ఎక్స్‌ 10, నోకియా ఎక్స్‌ 20 అని తెలుస్తోంది.


9. ఈ ఫాస్ట్‌ చాలా ఫాస్ట్‌ అట

వన్‌ ప్లస్‌ 9 ప్రోలో వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ ఉంటుందని గతంలో వార్తలొచ్చాయి. 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉండబోతోందని కూడా వార్తలొచ్చాయి. అయితే ఈ విషయంలో సంస్థ వేరే ఆలోచనలు చేస్తోందట. కొత్త వన్‌ప్లస్‌ ‘ప్రో’లో 50 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను తీసుకొస్తారని తాజా  సమాచారం. అదే సమయంలో 65 వాట్‌ వైర్డ్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఉండబోతోంది. వన్‌ ప్లస్‌ 8 ప్రోలో 30 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. మార్చి 23న జరిగే వర్చువల్‌ ఈవెంట్‌లో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది.


10. కొత్త పిక్సల్‌ తెస్తున్నారు

గూగుల్‌ నుంచి కొత్త మొబైల్‌ వస్తుందని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ మొబైల్‌ ఏంటి అనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా గూగుల్‌ నుంచి ఓ మొబైల్‌ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) సర్టిఫికెట్‌ పొందినట్లు వార్తలొస్తున్నాయి. దాని వివరాల ప్రకారం చూస్తే... అది పిక్సల్‌ 5ఏ అవుతుందని అంటున్నారు. GR0M2 పేరుతో బీఐఎస్‌లో రిజిస్టర్‌ చేయించారు. గతంలో వచ్చిన Pixel 3a (G020F), Pixel 3a XL (G020B), and Pixel 4a (G025N) పేర్లకు కొత్త మొబైల్‌ పేరుకు ఎలాంటి పోలికా కనిపించడం లేదు. కాబట్టి ఇదేదో కొత్త సిరీస్‌ మొబైల్‌ అవ్వొచ్చు అనే వార్తలూ వస్తున్నాయి.


- ఇంటర్నెట్‌ డెస్క్‌

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న

రుచులు