మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ అయ్యిందా?
close

Updated : 23/10/2020 18:42 IST
మీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ అప్‌డేట్‌ అయ్యిందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాట్సాప్‌లో నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి. సాధారణంగా వాటిలో చాలా వరకు గుడ్‌ మార్నింగ్‌, బర్త్‌డే విషెస్‌, వైరల్‌ వీడియోల వంటివే ఎక్కువగా ఉంటాయి. మనకు అసలు ఎలాంటి సంబంధం లేని, అవసరం లేని సందేశాలు వచ్చి ఫోన్లో చేరి పోతుంటాయి. ఇవి మనకు ఒక్కోసారి విసుగు తెప్పిస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వాట్సాప్‌ సరికొత్త ఫీచర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. నోటిఫికేషన్స్‌ను పర్మినెంట్‌గా మ్యూట్‌ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక ఏడాదిగా ఉన్న మ్యూట్‌ ఆప్షన్లలో ‘ఆల్వేస్‌’ను చేర్చింది. ఒక ఏడాది స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. అంటే మనమిక అవసరం లేని గ్రూపుల నోటిఫకేషన్లను శాశ్వతంగా మ్యూట్‌ చేయొచ్చు. అన్‌మ్యూట్‌ చేసే వరకు అవి మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయవు. ‘వాట్సాప్‌ వెబ్‌’లోనూ ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రకటించింది.  

నిజానికి యూజర్లు ఈ ఆప్షన్‌ కోసం ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. ఈ ఫీచర్‌కు సంబంధించి వాట్సాప్‌ కొన్ని నెలల క్రితమే సమాచారమిచ్చింది. అప్పటి నుంచి వాట్సాప్‌ ప్రియులు దీని కోసం ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్నారు. వాట్సాప్‌‌ ప్రవేశపెట్టిన నాటి నుంచే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే బాగుండేదన్న అభిప్రాయాన్ని చాలా మంది యూజర్లు సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తం చేశారు. కొన్ని రోజుల క్రితం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ ప్రయోగాత్మకంగా పరీక్షించిన వాట్సాప్‌ తాజాగా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ఇంతకీ ఈ కొత్త ఫీచర్‌ మీ మొబైల్‌లో అప్‌డేట్‌ అయ్యిందా..? లేదంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే యాప్‌ స్టోర్‌కి వెళ్లి వాట్సాప్‌ని అప్‌డేట్‌ చేయండి మరి!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న