WhatsApp Data: హ్యాకర్లకు చిక్కదు..థర్డ్‌ పార్టీలకు దొరకదు..!
close

Published : 04/08/2021 13:17 IST
WhatsApp Data: హ్యాకర్లకు చిక్కదు..థర్డ్‌ పార్టీలకు దొరకదు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో షేర్ చేసే సమాచారం సురక్షితమేనా? అనే సందేహం ఎంతో కాలంగా వేధిస్తున్న ప్రశ్న. అందుకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత కల్పిస్తున్నామని వాట్సాప్ చెబుతోంది. దానివల్ల యూజర్స్ మధ్య జరిగే సంభాషణలను వాట్సాప్‌తో సహా మూడో వ్యక్తి కూడా చూడలేరు. మరి వాట్సాప్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో ఉన్న మెసేజ్‌లకు ఎలాంటి భద్రత ఉంటుందనేది చాలా కాలంగా యూజర్స్ లేవనెత్తుతున్న సందేహం. ఇకమీదట వాట్సాప్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో స్టోర్ అయిన  మెసేజ్‌లు ఇతరులు యాక్సెస్ చేయకుండా వాటికి కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) పేర్కొంది. అలానే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్ అయిన మెసేజ్‌లను గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల థర్డ్‌పార్టీలు ఫోన్‌లో బ్యాక్‌అప్‌ అయిన వాట్సాప్ మెసేజ్‌లను యాక్సెస్‌ చేయలేవు. అలానే హ్యాకర్స్‌ నుంచి కూడా యూజర్ డేటాకు రక్షణ ఉంటుందని వాట్సాప్ తెలిపింది.

ఇప్పటికే వాట్సాప్ క్లౌడ్‌లో స్టోర్‌ అయ్యే ఛాట్‌ బ్యాక్‌అప్‌లకు 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ కీతో రక్షణ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ యూజర్ 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్ పాస్‌కోడ్ మర్చిపోతే డేటా రికవరీ చేయడం కుదరదు. అలాగే, వాట్సాప్ డేటాను కూడా యాక్సెస్ చేయలేరు. దీంతోపాటు మల్టీడివైజ్‌ ఫీచర్‌లో కూడా ప్రతి డివైజ్‌కు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటెక్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. తాజాగా ఫోన్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో స్టోర్‌ అయ్యే మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పించనుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న