Apply Now: భారీ వేతనాలతో సెంట్రల్ బ్యాంకులో ఆఫీసర్‌ ఉద్యోగాలు

Bank Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌ నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 

Updated : 29 Oct 2023 15:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Central Bank of India)లో స్పెషలిస్ట్‌ కేటగిరీలో ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది.  హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో వేర్వేరు స్ట్రీమ్‌లలో మొత్తం 192 ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 19లోపు https://www.centralbankofindia.co.in/en/recruitments  వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

  • పోస్టుల వివరాలు:  ఆఫీసర్‌ (స్పెషలిస్ట్‌ కేటగిరీ) స్కేల్‌ I: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(15), రిస్క్‌ మేనేజర్‌(2), సెక్యూరిటీ ఆఫీసర్‌(15), లైబ్రేరియన్‌(1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా.. స్కేల్‌ -2లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(73), లా ఆఫీసర్‌(15), క్రెడిట్‌ ఆఫీసర్‌(50), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌(4), సీఏ -ఫైనాన్స్‌/అకౌంట్స్‌/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్‌ షీట్‌/ట్యాక్సేషన్‌ (3); స్కేల్‌ IIIలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌ (5), స్కేల్‌ IV రిస్క్‌మేనేజర్‌ (1); స్కేల్‌ Vలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (1), రిస్క్‌ మేనేజర్‌ (1) చొప్పున భర్తీ చేస్తారు. 
  • అర్హత: ఆయా విభాగాల్లో గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఇంజినీరింగ్‌/డేటా అనలిటిక్స్‌లో డిగ్రీ/ఎంబీఏ/ ఎంబీఏ ఫైనాన్స్‌/ఎంసీఏ/ఎమ్మెస్సీ(ఐటీ).. ఇలా ఆయా ఉద్యోగ ఖాళీలను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు.
  • వయో పరిమితి:  పోస్టులను బట్టి కనిష్ఠ వయస్సు 30 ఏళ్లు కాగా.. గరిష్ఠంగా 45 ఏళ్లు.
  • పే స్కేల్:  స్కేల్‌ -1 ఉద్యోగాలకు వేతన శ్రేణి ₹36000-₹63,840 చొప్పున ఉండగా.. స్కేల్‌ II పోస్టులకు ₹48,170- ₹69,810; స్కేల్‌ III ₹63840 -₹78,230; స్కేల్‌ IV ₹76010 - ₹89,890; స్కేల్‌ V- ₹89,890- ₹1,00,350 చొప్పున వేతనం చెల్లిస్తారు.
  • దరఖాస్తు ఫీజు: ₹850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ₹175
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
  • రాత పరీక్ష డిసెంబర్‌ మూడు లేదా నాలుగో వారంలో ఉండొచ్చు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని