నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని  హిందూస్థాన్‌ ఉర్వారక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

Published : 28 Apr 2024 00:02 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
హెచ్‌యూఆర్‌ఎల్‌లో వివిధ పోస్టులు

న్యూదిల్లీలోని  హిందూస్థాన్‌ ఉర్వారక్‌ అండ్‌ రసాయన్‌ లిమిటెడ్‌ ఒప్పంద/ రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 80

1. మేనేజర్‌: 18

2. ఇంజినీర్‌: 34 3. ఆఫీసర్‌: 14

4. మేనేజర్‌: 2

5. చీఫ్‌ మేనేజర్‌: 2

6. అసిస్టెంట్‌ మేనేజర్‌ (కాంట్రాక్ట్‌): 7

7. ఆఫీసర్‌ (కాంట్రాక్ట్‌): 3

విభాగాలు: కాంట్రాక్ట్స్‌ అండ్‌ మెటీరియల్స్‌, కెమికల్‌, మార్కెటింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, సేఫ్టీ, ఫైనాన్స్‌, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌, హ్యూమన్‌ రిసోర్స్‌, లీగల్‌.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: స్కీన్రింగ్‌/ రాత పరీక్షలు, ట్రేడ్‌/ స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 20 మే 2024.

వెబ్‌సైట్‌: https://jobs.hurl.net.in/


తెలంగాణలో సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పోస్టులు

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పరిధిలోని జూనియర్‌ విభాగంలో సివిల్‌ జడ్జీల భర్తీకి హైదరాబాద్‌లోని తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 150

1. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (2024 సంవత్సరానికి): 31

2. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)- బదిలీ ద్వారా భర్తీ (2024 సంవత్సరానికి): 15

3. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) (2024, 2025 సంవత్సరాలకు): 90

4. సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)- బదిలీ ద్వారా భర్తీ (ఫ్యూచర్‌/ యాంటిసిపేటెడ్‌) (2024, 2025 సంవత్సరాలకు): 14

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ. మూడేళ్ల పాటు అడ్వకేట్‌ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్‌ చేసి ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్‌ నియమ నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్థులు కనిష్ఠంగా 23 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 35 ఏళ్లు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

జీత భత్యాలు: నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌), రాత పరీక్ష, వైవా టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500).

స్కీన్రింగ్‌ టెస్ట్‌ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17 మే 2024

స్క్రీనింగ్‌ పరీక్ష తేదీ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): 16 జూన్‌ 2024

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని