CTET 2024: సీటెట్‌ (జులై) నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష తేదీ ఇదే.. దరఖాస్తులు షురూ..

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET July- 2024)కు దరఖాస్తులు మొదలయ్యాయి. పూర్తి వివరాలు ఇవిగో..

Published : 08 Mar 2024 00:46 IST

CTET 2024 Applications| దిల్లీ: దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ(CBSE) నిర్వహించే కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET Exam-July 2024)కు నోటిఫికేషన్‌ విడుదలైంది. 19వ ఎడిషన్‌ సీటెట్‌ పరీక్షను 2024 జులై 7న (ఆదివారం) నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో నిర్వహించే ఈ పరీక్షకు మార్చి 7 నుంచి ఏప్రిల్‌ 2 రాత్రి 11.59 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

కొన్ని ముఖ్యమైన పాయింట్లు..

  • సీటెట్‌ ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. ప్రస్తుతం 19వ ఎడిషన్‌ సీటెట్‌కు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి.
  • దరఖాస్తు రుసుం: జనరల్‌/ఓబీసీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1000; రెండు పేపర్లకు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులైతే ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ.600ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ పరీక్షలో సాధించిన స్కోరును కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాల వ్యాలిడిటీ ఉంటుంది.
  • ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్‌లు ఉంటాయి. పేపర్-1ను​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునేవారు; పేపర్-2ను​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారు రాయొచ్చు.
  • పేపర్-2 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఉంటుంది. పేపర్‌ -1 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌. పూర్తి సమాచారంతో కూడిన బుక్‌లెట్‌ కోసం క్లిక్‌ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని