TS EAPCET Hall tickets: టీఎస్‌ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా!

TS EAPCET Hall tickets | తెలంగాణ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌/ఫార్మా విద్యార్థులు ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Updated : 30 Apr 2024 18:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. సోమవారం ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లను మాత్రమే విడుదల చేసిన అధికారులు.. తాజాగా ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

రాష్ట్రంలో మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్‌ ఈఏపీసెట్‌ పరీక్షలు జరగనుండగా.. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ;  మే 9, 10, 11 తేదీల్లో  ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌ కోసం తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 3.54 లక్షల మందికి పైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని