TS ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ ఇదే..

తెలంగాణలో ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 02 May 2024 19:48 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 24 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్‌ 24న ఫలితాలు విడుదల చేసినప్పుడు సప్లిమెంటరీ పరీక్షలను మే 24 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాల వల్ల షెడ్యూల్‌లో మార్పు చేశారు. రీకౌంటింగ్ రీవాల్యుయేషన్‌కు  మే 2వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి పేపర్‌కు రూ.600 చొప్పున రుసం చెల్లించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని