NCERT: పాఠ్య పుస్తకాల అప్‌డేషన్‌పై NCERTకి కేంద్రం కీలక సూచన!

ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్‌డేట్‌ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్‌సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం.

Published : 29 Apr 2024 19:14 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (NCERT)కు కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏటా పాఠ్య పుస్తకాలను సమీక్షించి, అప్‌డేట్‌ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం.. వార్షిక ప్రాతిపదికన పుస్తకాలను అప్‌డేట్‌ చేసే పద్ధతి ఏమీ లేదు. ప్రపంచం వేగంగా మారుతోన్న నేపథ్యంలో పాఠ్యపుస్తకాలను క్రమంతప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం ఎంతో ముఖ్యమని భావించిన కేంద్రం.. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు ఏటా పుస్తకాలను సమీక్షించి, నవీకరించాలని ఎన్‌సీఈఆర్టీని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు  ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి.

టీఎస్‌ ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌) హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా!

ఇదిలాఉండగా.. 2023లో ఎన్‌సీఈఆర్టీ ప్రకటించిన న్యూ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్ (NCF)ను అనుసరించి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తుండగా.. 2026 విద్యా సంవత్సరం నాటికి అన్ని తరగతులకు ఈ పుస్తకాలు సిద్ధం కానున్నాయి.   ఈ ఏడాది మూడు, ఆరో తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఇటీవల ఎన్‌సీఈఆర్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని