TS EAPCET - 2024: టీఎస్‌ ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌) హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్‌ ఇలా!

TS EAPCET Halltickets | తెలంగాణ ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌) హాల్‌టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లు మే 1 నుంచి అందుబాటులోకి తేనున్నారు.

Updated : 29 Apr 2024 16:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు జరగనున్న టీఎస్‌ ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఫార్మసీ విభాగానికి సంబంధించిన హాల్‌టికెట్లను మాత్రమే విడుదల చేసిన అధికారులు.. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ హాల్‌టికెట్లను మే 1న అందుబాటులోకి తేనున్నారు. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేసి తమ హాల్‌టికెట్లు పొందొచ్చు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

టీఎస్‌ ఈఏపీసెట్‌ రాసే విద్యార్థులకు కీలక సూచనలివే..

మే 7 నుంచి 11వ తేదీ వరకు టీఎస్‌ ఈఏపీసెట్‌ పరీక్షలు జరగనుండగా.. మే 7, 8 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ విభాగానికి సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. మే 9, 10, 11 తేదీల్లో  ఇంజినీరింగ్ స్ట్రీమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈఏపీ సెట్‌కు మొత్తంగా దాదాపు 3.54 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకోగా.. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగానికి 1,00,260 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఈఏపీసెట్‌ కన్వీనర్‌ డీన్ కుమార్ వెల్లడించారు. మిగతా అందరూ ఇంజినీరింగ్‌కు దరఖాస్తు చేశారని తెలిపారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని