UGC NET 2024: యూజీసీ -నెట్‌ పరీక్ష తేదీ మార్పు.. కారణం ఇదే!

యూజీసీ నెట్‌ పరీక్ష తేదీలో మార్పు జరిగినట్లు యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

Updated : 29 Apr 2024 17:44 IST

దిల్లీ: యూజీసీ నెట్ పరీక్ష (UGC NET 2024) షెడ్యూల్‌ మారింది. ఈ పరీక్షను జూన్‌ 18కు రీషెడ్యూల్‌ చేసినట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ సోమవారం సాయంత్రం ప్రకటించారు. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షను తొలుత నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమైతే జూన్‌ 16న జరగాల్సి ఉంది. అయితే, అదేరోజు సివిల్స్‌ (ప్రిలిమినరీ) పరీక్ష కూడా ఉంది. ఈనేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకొని యూజీసీ నెట్‌ పరీక్షను జూన్‌ 18 (మంగళవారం) నిర్వహించాలని ఎన్‌టీఏ, యూజీసీ నిర్ణయం తీసుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై త్వరలోనే ఎన్‌టీఏ(NTA) అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తుందని ఆయన ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.  మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే పెన్ను, పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) ఆధారిత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మే 10 వరకు కొనసాగనుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని