Singareni Jobs: సింగరేణిలో 327 ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీల్లో మార్పు
సింగరేణిలో 327 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. కొత్త తేదీలు ఇవే..
ఇంటర్నెట్ డెస్క్: సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు.. ఆ తేదీల్లో మార్పు చేశారు. వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15న మధ్యాహ్నం 12గంటల నుంచి జూన్ 4 సాయంత్రం 5గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టులివే..
- ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. మేనేజ్మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్- 42, మేనేజ్మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్- 7.
- నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. జూనియర్ మైనింగ్ ఇంజినీరు టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(మెకానికల్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ- 9, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) టీ అండ్ ఎస్ గ్రేడ్ సీ- 24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1- 98 చొప్పున భర్తీ చేయనున్నారు.
- అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM