Updated : 11 Mar 2021 13:12 IST

నిర్మాణ కోర్సులకు నిక్మార్‌ మార్గం

దేశంలో నిర్మాణరంగం విస్తరిస్తూ ఈ విభాగంలో పెద్దఎత్తున ఉపాధి లభిస్తోంది. ఈ నేపథ్యంలో నేషనల్‌    ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌) హైదరాబాద్‌ సహా వివిధ కేంద్రాల్లో కోర్సులు అందిస్తోంది. తాజాగా వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది!

నిక్మార్‌కు పుణె, హైదరాబాద్‌ (షామీర్‌పేట), దిల్లీ, గోవాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో రెండేళ్లు, ఏడాది వ్యవధితో వివిధ రకాల రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ పరీక్ష, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారూ, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి సెప్టెంబరు 6 నుంచి తరగతులు మొదలవుతాయి. మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్పు అందిస్తున్నారు.

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె, హైదరాబాద్, దిల్లీ, గోవా క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు
అర్హత: ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / డిజైన్‌ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ప్రొజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె, హైదరాబాద్‌ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె క్యాంపస్‌లో అందుబాటులో ఉంది.
అర్హత: ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ప్లానింగ్‌ ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

కోర్సు: పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె క్యాంపస్‌లో. .
అర్హత: ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ప్లానింగ్‌ లో 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత

కోర్సు: పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు
అర్హత: ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు: పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌ హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిప్లొమాతోపాటు నాలుగేళ్ల పని అనుభవం.  

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో పుణె క్యాంపస్‌లో అందిస్తున్నారు
అర్హత: నిర్మాణ రంగంలో సేవలు అందిస్తోన్న కుటుంబాలకు చెందినవారికే ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అవకాశాలిలా..
ఈ సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ నియామకాలతో ప్రముఖ స్థిరాస్తి కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. లోథా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్, యునీటెక్, టాటా హౌసింగ్, అన్సాల్‌ ఏపీఐ, రహేజా యూనివర్సల్, లార్సెన్‌ అండ్‌ టబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్, 99 యాకర్స్, మ్యాజిక్‌ బ్రిక్స్, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.కామ్‌.. తదితర సంస్థల్లో వీరికి అవకాశాలుంటాయి. విదేశీ నిర్మాణ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 14
దరఖాస్తు ఫీజు: ఒక కోర్సుకైతే రూ.2100. ఎక్కువ కోర్సులకు రూ.2620
ఆన్‌లైన్‌ పరీక్షలు: ఏప్రిల్‌ 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో ఉంటాయి.
www.nicmar.ac.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts