డిగ్రీ తర్వాత...?

బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. డిగ్రీ తర్వాత ఏ ఉన్నత విద్యావకాశాలుంటాయి? 

Published : 27 Jan 2022 10:59 IST

బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదువుతున్నాను. డిగ్రీ తర్వాత ఏ ఉన్నత విద్యావకాశాలుంటాయి? - యు. నాగేంద్రకుమార్‌  


- బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌) చదివిన తరువాత ఈ మూడు సబ్జెక్టుల్లో దేంట్లోనైనా ఎంఎస్సీ చేసే అవకాశం ఉంది. నిమ్‌సెట్‌ కానీ, ఐసెట్‌ కానీ రాసి ఎంసీఏ కూడా చేయవచ్చు. ఎంఎస్సీ డేటాసైన్స్‌ కూడా చేయొచ్చు. క్యాట్‌/ ఐసెట్‌ రాసి ఎంబీఏ కూడా చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఎంబీఏ బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సు గురించి కూడా ఆలోచించవచ్చు. ఆక్చూరియల్‌ సైన్స్‌లో పీజీ చదివే అవకాశం కూడా ఉంది. ఇటీవల కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ప్రారంభించిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లర్నింగ్‌ లాంటి కోర్సులు చేస్తే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బీఎస్సీ డిగ్రీ పూర్తయ్యాక బీఈడీ కూడా చేయవచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని