Published : 19 Jul 2022 01:30 IST

జేఈఈలో మెరిసేలా..!

ఏడాది జేఈఈ పరీక్షను దేశవ్యాప్తంగా 12 లక్షల మందికిపైగా రాస్తున్నారు. ఇంత పోటీ ఉన్న తరుణంలో విద్యార్థులు, తల్లిదండ్రులపైన అంతే ఒత్తిడి కూడా ఉంటుంది. అందుకే ఈ సమయంలో వారికి సహకరించేలా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు పనిచేసే ‘పీక్‌మైండ్‌’ సంస్థ ‘కంపీట్‌ 2022’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ద్వారా ఈ పరీక్షలో మెరుగైన స్కోరు సాధించేలా దిశానిర్దేశం చేస్తారు.

* ఈ సేవలను ముందు వారం రోజులు ఉచితంగా పొందవచ్చు. నచ్చితే నెల నుంచి ఏడాది వరకూ కొనసాగించేందుకు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

* ముందు వెబ్‌సైట్‌లోకి వెళ్తే మనకు కొందరు కోచ్‌లు కనిపిస్తారు. వీరంతా ఐఐటీ దిల్లీ, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ ముంబయి, యూనివర్సిటీ ఆఫ్‌ స్టిర్లింగ్‌ వంటి పేరుమోసిన విద్యాసంస్థల్లో సీనియర్‌ అధ్యాపకులు. ఎంచుకున్న కోచ్‌తో వాట్సాప్‌లో మాట్లాడే అవకాశం ఉంటుంది. మన సందేహాలను నేరుగా అడిగి నివృత్తి చేసుకునేందుకే ఈ ఏర్పాటు.  

* పరీక్షకు సిద్ధమవుతున్నవారు తమను తాము అంచనా వేసుకునేలా అసెస్‌మెంట్‌ టెస్ట్‌ ఒకటి ఉచితంగా రాయవచ్చు. దాని ద్వారా విద్యార్థి తన సన్నద్ధత ఏమేరకు ఉందో తెలుసుకోవచ్చు.

* కోచ్‌లు విద్యార్థులకు పరీక్షలో ఉపయోగపడే మెలకువలు చెప్పడమే కాకుండా, వారు మానసికంగా దృఢంగా తయారయ్యేలా సలహాలు - సూచనలు ఇస్తారు. ధైర్యంగా పరీక్ష రాసేలా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతారు.

* ఒత్తిడి, భయం, అభద్రతాభావం వంటివాటికి లోనుకాకుండా విద్యార్థులకు ఈ కార్యక్రమం చేయూతనిస్తుంది.

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌: https://www.peakmind.in/compete


స్ట డీ కో ట్‌

ఏదైనా ఒకసారి వింటే సులువుగా మర్చిపోతాం. పాఠంలా చదివితే కొన్నాళ్లు గుర్తుంచుకుంటాం.
కానీ అందులో పూర్తిగా మమేకమైనప్పుడు మాత్రమే అసలదేంటో నేర్చుకోగలం.
- బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని