నోటీస్‌బోర్డు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్‌, గ్రామీణ ఉపాధి కమిషనర్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 20 Sep 2021 06:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

తెలంగాణలో 172 జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్‌, గ్రామీణ ఉపాధి కమిషనర్‌ కార్యాలయం స్పోర్ట్స్‌ కోటా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ పంచాయతీ సెక్రటరీలు మొత్తం ఖాళీలు: 172

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. స్పోర్ట్స్‌ కోటాలో అర్హత ఉండాలి.

వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్షతో పాటు క్రీడలకి సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 08.

https://epanchayat.telangana.gov.in/cs


ఏపీ సీఎఫ్‌డబ్ల్యూ-44 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కార్యాలయం (సీఎఫ్‌డబ్ల్యూ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు మొత్తం ఖాళీలు: 44

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఏపీఎంసీలో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 42 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, అనుభవం, ఇతర వివరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, సెప్టెంబరు 24. చిరునామా: డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌, గొల్లపూడి, విజయవాడ.

వెబ్‌సైట్‌: https://cfw.ap.nic.in/


డీఆర్‌డీఓ-సైంటిఫిక్‌ అనాలిసిస్‌ గ్రూప్‌లో....

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దిల్లీలోని డీఆర్‌డీఓ-సైంటిఫిక్‌ అనాలిసిస్‌ గ్రూప్‌ (ఎస్‌ఏజీ) వివిధ విభాగాల్లో జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌) మొత్తం ఖాళీలు: 09

విభాగాల వారీగా ఖాళీలు: మ్యాథమేటిక్స్‌-03, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ-03, ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌-03.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, నెట్‌/ గేట్‌ స్కోర్‌తో పాటు కంప్యూటర్‌ నైపుణ్యాలు ఉండాలి.

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: www.drdo.gov.in/


ఐఓసీఎల్‌లో ఇంజినీర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీఎల్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆఫీసర్లు/ ఇంజినీర్లు విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

ఎంపిక విధానం: గేట్‌-2022 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌, గ్రూప్‌ టాస్క్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

వెబ్‌సైట్‌: https://iocl.com/


ప్రవేశాలు

ఓయూ-రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో...

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జీ రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు

అర్హత: కోర్సులని అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2)/ తత్సమాన, గ్రాడ్యుయేషన్‌, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌-2021 ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, డిసెంబరు 15.

వెబ్‌సైట్‌: www.oucde.net/


అప్రెంటిస్‌షిప్‌

చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌లో...

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన చిత్తరంజన్‌(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 492

ట్రేడులు: ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, వెల్డర్‌, ఎలక్ట్రీషియన్‌, రిఫ్రిజిరేషన్స్‌ అండ్‌ ఏసీ మెకానిక్స్‌, పెయింటర్‌. అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ) ఉత్తీర్ణత.

వయసు: 15.09.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ/ ఓరల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021 అక్టోబరు 03.

వెబ్‌సైట్‌: https://clw.indianrailways.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని