నోటీస్‌బోర్డు

ఇర్కాన్‌, న్యూదిల్లీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

Published : 24 Apr 2024 00:00 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఇర్కాన్‌, న్యూదిల్లీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - 6 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

అర్హత: డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీతో పాటు పని అనుభవం.
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000- రూ.1,40,000
దరఖాస్తుకు చివరి తేదీ:10-05-2024

వెబ్‌సైట్‌:  www.ircon.org


న్యూదిల్లీ, సీఎంఎస్‌ఎస్‌లో అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్లు

న్యూదిల్లీ, సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ - ఒప్పంద ప్రాతిపదికన 15  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 05
  •  మేనేజర్‌: 08  
  •  ఆఫీస్‌ అసిస్టెంట్‌: 01  
  •  వేర్‌హౌస్‌ మేనేజర్‌: 01  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, ఎమ్మెస్సీ, బీకాం, బీఫార్మా, ఎంఫార్మా, బీఈ, బీటెక్‌ డిగ్రీ.
వయసు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, వేర్‌హౌస్‌ మేనేజర్‌ పోస్టులకు 45 ఏళ్లు; మేనేజర్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు రూ.1,00,000. మేనేజర్‌, వేర్‌హౌస్‌ పోస్టులకు రూ.50,000. ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.30,000
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 20-05-2024
దరఖాస్తులు పోస్ట్‌ ద్వారా పంపాలి.
చిరునామా: ద జనరల్‌ మేనేజర్‌ అడ్మినిస్ట్రేషన్‌, సెంట్రల్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సొసైటీ, 2వ ఫ్లోర్‌, విశ్వయువక్‌ కేంద్ర, తీన్‌ మూర్తి ప్రభుత్వ ఉద్యోగాలుమార్గ్‌, చాణక్యపురి, న్యూదిల్లీ.

వెబ్‌సైట్‌:   https://cmss.gov.in/recruitment-cmss/Index/ institute_index/ins/RECINS001


వాక్‌-ఇన్స్‌

ఐఐఎస్‌ఆర్‌ ఇందౌర్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు  

కార్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోయాబిన్‌ రిసెర్చ్‌, ఇందౌర్‌ (మధ్యప్రదేశ్‌)- తాత్కాలిక ప్రాతిపదికన 6 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  •  జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 03  
  •  రిసెర్చ్‌ అసోసియేట్‌: 01  
  •  యంగ్‌ ప్రొఫెషనల్‌-ఖిఖి: 02

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్‌ డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
ఇంటర్వ్యూ తేదీలు: మే 2, 3
ప్రదేశం : ఐకార్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోయాబిన్‌ రిసెర్చ్‌, ఖండ్వడ రోడ్‌, ఇందౌర్‌ (మధ్యప్రదేశ్‌).
దరఖాస్తులు పంపాల్సిన ఇ-మెయిల్‌:  milind.ratnaparkhe@gmail.com

వెబ్‌సైట్‌:  https://iisrindore.icar.gov.in/


ప్రవేశాలు

ఏపీ ఎడ్‌సెట్‌-2024  

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎడ్‌సెట్‌) 2024 నోటిఫికేషన్‌ను ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసింది.  

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. బీటెక్‌, బీసీఏ, బీబీఎం విద్యార్థులూ అర్హులే. ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు పూర్తిచేసుకుంటున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.  
పరీక్ష: మూడు విభాగాల్లో 150 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు.
రిజిస్ట్రేషన్‌ ఫీజు: ఎస్సీ/ ఎస్టీలకు రూ.450; బీసీలకు రూ.500, ఓసీలకు రూ.650.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-05-2024.
హాల్‌ టిక్కెట్ల డౌన్‌లోడ్‌: 30-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 08-06-2024.

వెబ్‌సైట్‌:   https://cets.apsche.ap.gov.in/ EDCET/Edcet/EDCET_Home Page.aspx


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని