టాటా మెమోరియల్‌ సెంటర్‌లో కొలువులు

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) 28 పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.

Published : 24 Apr 2024 00:03 IST

ముంబయిలోని టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) 28 పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపికైనవారిని ముంబయి, వారణాసి, వైజాగ్‌, గువాహటీల్లో ఉన్న టాటా మెమోరియల్‌ హాస్పిటల్‌, హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటళ్లలో ఎక్కడైనా నియమిస్తారు. వీరికి వేతనంతోపాటుగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ లాంటి ప్రోత్సాహకాలు, వైద్య, వసతి.. పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ సదుపాయాలు ఉంటాయి. ఆఫీసర్‌గా ఎంపికైనవారికి ప్రొబేËెషన్‌ కాలపరిమితి పూర్తయిన తర్వాత జాతీయ, అంతర్జాతీయ మెడికల్‌ సమావేశాలు, శిక్షణ తరగతులు, సదస్సులకు హాజరయ్యే అవకాశం కల్పిస్తారు.

ఏయే పోస్టులు?

1. మెడికల్‌ ఫిజిసిస్ట్‌-1: ఎమ్మెస్సీ (ఫిజిక్స్‌), రేడియోలాజికల్‌ ఫిజిక్స్‌ డిప్లొమా పూర్తిచేయాలి. లేదా ఏఈఆర్‌బీ ఆమోదించిన విద్యార్హతలు, రేడియోలాజికల్‌ సేఫ్టీ ఆఫీసర్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. వయసు 35 సంవత్సరాలు మించకూడదు.

  •  మెడికల్‌ ఫిజిసిస్ట్‌గా ఏడాది క్లినికల్‌ అనుభవం తప్పనిసరి.
  • సీ++, మ్యాట్‌లాబ్‌, పైతాన్‌.. మొదలైన కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలు ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
  • వేతనం నెలకు రూ.56,100 + ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

2. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌-3: డిగ్రీ పాసవడంతోపాటు ఎంఎస్‌-ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి. ఏడాది ఉద్యోగానుభవం అవసరం. వయసు 27 సంవత్సరాలు మించకూడదు.

వేతనం నెలకు రూ.19,900 + ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

3. స్టెనోగ్రాఫర్‌-1: డిగ్రీ పాసవ్వాలి. షార్ట్‌హ్యాండ్‌ వేగం నిమిషానికి 80 పదాలు, టైపింగ్‌ వేగం నిమిషానికి 40 పదాలు ఉండాలి. ఎంఎస్‌-ఆఫీస్‌లో కనీసం మూడు నెలల కోర్సు పూర్తిచేయాలి. లేదా కంప్యూటర్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో డిప్లొమా/ డిగ్రీ ఉండాలి. గరిష్ఠ వయసు 27 సంవత్సరాలు.

  •  ప్రముఖ సంస్థలో ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి.
  •  సెక్రటేరియల్‌ కోర్సులు చేసినవారికి ప్రాధాన్యమిస్తారు.
  •  వేతనం నెలకు రూ.25,500 + ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

4. ఫిమేల్‌ నర్స్‌-22: జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ, డిప్లొమా ఇన్‌ ఆంకాలజీ లేదా బేసిక్‌/ పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ (నర్సింగ్‌) పూర్తిచేయాలి. వయసు 30 సంవత్సరాలు మించకూడదు.

  •  ఇండియన్‌/ స్టేట్‌  నర్సింగ్‌ కౌన్సిల్‌లో నమోదవ్వాలి.
  •  టీఎంసీలో నర్సింగ్‌ ఆంకాలజీ డిప్లొమా చేసి, బాండ్‌ పీరియడ్‌ కాలానికి పనిచేసినవారికి.. గరిష్ఠ వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది.  
  •  50 పడకల ఆసుపత్రిలో ఏడాది పనిచేసిన అనుభవం తప్పనిసరి.
  •  వేతనం రూ.44,900 + ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

5. టెక్నీషియన్‌ సి -1: సైన్స్‌ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్‌ పాసవ్వాలి. ఐసీయూ/ ఓటీ/ ఎలక్ట్రానిక్స్‌/ డయాలిసిస్‌ టెక్నీషియన్‌గా ఏడాది/ ఆరునెలల డిప్లొమా పూర్తిచేయాలి. గరిష్ఠ వయసు 30 సంవత్సరాలు.

  •  సంబంధిత రంగంలో మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి.
  •  వేతనం రూ.25,500 + ఇతర ప్రోత్సాహకాలు ఉంటాయి.

గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పది నుంచి పదిహేనేళ్లు, టీఎంసీ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

  •  ఆన్‌లైన్‌ దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి.. ఇంటర్వ్యూ/ రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌కు పిలుస్తారు.
  •  ఇంటర్వ్యూ సమయంలో ఒరిజినల్‌ ధ్రువపత్రాలను పరిశీలిస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 07.05.2024
వెబ్‌సైట్‌:- https://tmc.gov.in 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని