నోటిఫికేషన్స్‌

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది.  

Updated : 11 May 2023 01:09 IST

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో ‘కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2023’ (సీహెచ్‌ఎస్‌ఎల్‌) ప్రకటన వెలువడింది.  

ఖాళీలు: 1,600

1. లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌(ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్

2. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో)

3. డేటా ఎంట్రీ ఆపరేటర్‌(గ్రేడ్‌-ఎ)

అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివుండాలి.

వయసు: 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.  

ఎంపిక: టైర్‌-1, టైర్‌-2 పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనక్కర్లేదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08-06-2023.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10-06-2023.

టైర్‌-1(కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష): ఆగస్టులో  

టైర్‌-2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) నిర్వహణ తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


ప్రవేశాలు

ఏపీ డీఈఈసెట్‌2023

పీ ప్రభుత్వ పాఠశాల విద్యా విభాగం రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కోర్సు: డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)

అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్‌ .

వయసు: కనిష్ఠంగా సెప్టెంబర్‌ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ పరిమితి లేదు.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు: 27.05.2023 వరకు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 11.05.2023 నుంచి 28.05.2023 వరకు.

ప్రవేశ పరీక్ష తేదీలు: 12.06.2023  నుంచి 13.06.2023.

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/


ట్రిపుల్‌ ఐటీడీఎంలో పీహెచ్‌డీ

ర్నూలులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ఐఐఐటీడీఎం) పీహెచ్‌డీ ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌.

అర్హత: సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎంఎస్సీ, ఎంఏతో పాటు గేట్‌, యూజీసీ- జేఆర్‌ఎఫ్‌/ నెట్‌/ సీఎస్‌ఐఆర్‌/ డీఏఈ-జెస్ట్‌/ ఇన్‌స్పైర్‌ ఫెలోషిప్‌లో అర్హత.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 25-05-2023.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ: 12-06-2023 నుంచి 15-06-2023 వరకు.

వెబ్‌సైట్‌: https://iiitk.ac.in/


మెడికల్‌ జెనెటిక్స్‌పై శిక్షణ

ముంబయిలోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ రిప్రొడక్టివ్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌, జెనెటిక్‌ రిసెర్చ్‌ సెంటర్‌ మెడికల్‌ జెనెటిక్స్‌పై ట్రైనింగ్‌ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

కాల వ్యవధి: 19 జూన్‌ నుంచి 14 జులై 2023 వరకు.

అర్హత: ఎంబీబీఎస్‌/ ఎండీ/ ఎంఎస్‌/ డీఎం లేదా ఎంసీహెచ్‌.

దరఖాస్తు గడువు: 25-05-2023.

వెబ్‌సైట్‌: https://nirrh.res.in/


ఐహెచ్‌ఎంలో డిప్లొమాలు

బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ అప్లైడ్‌ న్యూట్రిషన్‌ వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. డిప్లొమా (ఫుడ్‌ ప్రొడక్షన్‌): 40 సీట్లు

2. డిప్లొమా (బేకరీ అండ్‌ కాన్‌ఫెక్షనరీ): 40 సీట్లు

3. క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌ (ఫుడ్‌ ప్రొడక్షన్‌): 40 సీట్లు

4. క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌ (ఫుడ్‌ బేవరేజ్‌ సర్వీస్‌): 40 సీట్లు

వ్యవధి: క్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌ (ఫుడ్‌ బేవరేజ్‌ సర్వీస్‌) 24 వారాలు, మిగిలినవి  18 నెలలు.

అర్హత: పది, పన్నెండో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.

దరఖాస్తుకు చివరి తేదీ: 24-07-2023.

https://www.ihmbangalore.kar.nic.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు