హార్వర్డ్‌ వర్సిటీ సందర్శనకు అవకాశం

చిన్న వయసులోనే విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల వైఖరిని పరీక్షించి ప్రోత్సహించే ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ పోటీలు సెప్టెంబరులో మొదలవుతున్నాయి.

Updated : 08 Aug 2022 01:13 IST

లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌

చిన్న వయసులోనే విద్యార్థుల్లో జీవన నైపుణ్యాల వైఖరిని పరీక్షించి ప్రోత్సహించే ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌ పోటీలు సెప్టెంబరులో మొదలవుతున్నాయి. నిర్వాహక సంస్థ ‘స్కిల్‌జన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌’ ఈ ఒలింపియాడ్‌ విజేతలకు  అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్‌ను సందర్శించే అవకాశాన్ని అందిస్తోంది.

సింగపూర్‌కు చెందిన సామాజిక విద్యా సంస్థ ‘స్కిల్‌జన్‌ ఒలింపియాడ్‌ ఫౌండేషన్‌’ ఆన్‌లైన్‌ వేదికగా జీవన నైపుణ్యాల పోటీలను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలను 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ చదివే 8-18 ఏళ్ల వయసు విద్యార్థుల కోసం రూపకల్పన చేశారు. వాస్తవ జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనేవిధంగా సిద్ధం చేయడానికి ఇది తోడ్పడతాయి. నాయకత్వం, విలువలు, బృందంలో పనిచేయడం, భావవ్యక్తీకరణ, సహానుభూతి, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం... లాంటి వాటిని అమలుచేయడం ద్వారా నిజ జీవితంలో నిర్ణయాలు తీసుకునే నేర్పును అందిస్తాయి. 2021లో జరిగిన ఈ ఆన్‌లైన్‌ ఒలింపియాడ్‌లో 72 దేశాలకు చెందిన పిల్లలు పాల్గొన్నారు. జీవన నైపుణ్యాలపై హార్వర్డ్‌ యూనివర్సిటీలో 2011లో జరిగిన పరిశోధనల ఫలితంగా ‘లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌’ను స్కిల్‌జన్‌ రూపొందించి పాఠశాల విద్యకు అతీతంగా నిత్య జీవితంలో సమర్థంగా వ్యవహరించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతోంది.

ఈ సంవత్సరం నాలుగు గ్రూపుల్లో నిర్వహించే నాలుగు లైఫ్‌స్కిల్స్‌ ఒలింపియాడ్స్‌ సెప్టెంబరు, డిసెంబరు నెలల్లో రెండు సెట్లలో జరుగుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల పేర్లను నమోదు చేసి తమకు అనువైన తేదీలను ఎంపిక చేసుకోవచ్చు.

ఇంటర్నేషనల్‌ ఎథిక్స్‌ అండ్‌ వేల్యూస్‌ ఒలింపియాడ్‌: సెప్టెంబరు 17, డిసెంబరు 3.
ఇంటర్నేషనల్‌ ఎకనమిక్స్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌: సెప్టెంబరు 24, డిసెంబరు 10.
ఇంటర్నేషనల్‌ లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌: సెప్టెంబరు 18, డిసెంబరు 2.
ఇంటర్నేషనల్‌ లైఫ్‌ స్కిల్స్‌ ఒలింపియాడ్‌: సెప్టెంబరు 25, డిసెంబరు 11

ఒక్కో గ్రూపులో గెలుపొందినవారికి లాప్‌టాప్స్‌, టాబ్లెట్స్‌, కిండిల్‌ లాంటి బహుమతులతో పాటు హార్వర్డ్‌ యూనివర్సిటీ సందర్శనకు ఉచిత విమాన టికెట్లను అందజేస్తారు.  

ఆసక్తి ఉన్నవారు http://www.lifeskillsolympiad.orgలో రూ.580 చెల్లించి పేర్లను రిజిస్టర్‌ చేసుకోచ్చు. లైఫ్‌స్కిల్‌ గైడ్స్‌, ప్రాక్టీస్‌ ప్రశ్నలు, మాక్‌ టెస్ట్‌లకు కూడా ఈ రుసుము వర్తిస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని