విదేశాలకు వెళ్లి చదవాలా?
చాలామంది విద్యార్థుల కల... విదేశాలకు వెళ్లి చదువుకోవడం! ఫారిన్ డిగ్రీలపై యువత ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. చదువుకునే సమయం నుంచి చక్కని ప్రణాళిక, సన్నద్ధతతో విదేశాలకు వెళ్తూ మెరుగైన కెరియర్‌కు బాటలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలా విదేశాలకు వెళ్లి చదవాలి అనుకుంటే ఉండే ప్రక్రియ ఏంటి? కావాల్సిన డాక్యుమెంట్లు, చూసుకోవాల్సిన విషయాలు....
చాలామంది విద్యార్థుల కల... విదేశాలకు వెళ్లి చదువుకోవడం! ఫారిన్ డిగ్రీలపై యువత ఆసక్తి నానాటికీ పెరుగుతోంది. చదువుకునే సమయం నుంచి చక్కని ప్రణాళిక, సన్నద్ధతతో విదేశాలకు వెళ్తూ మెరుగైన కెరియర్‌కు బాటలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇలా విదేశాలకు వెళ్లి చదవాలి అనుకుంటే ఉండే ప్రక్రియ ఏంటి? కావాల్సిన డాక్యుమెంట్లు, చూసుకోవాల్సిన విషయాలు, ఇలా మొత్తంగా మనమూ తెలుసుకుందాం.
జీవితంలో విజయవంతం కావాలంటే ముందు మనకేం కావాలనే విషయంపై స్పష్టత అవసరం. దానికి తగిన విధంగా చదవాల్సిన కోర్సులు, చేయాల్సిన డిగ్రీలను ఎంచుకుంటే, పని మరింత సులభమవుతుంది. ఉదాహరణకు మనం ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టంను తయారుచేయాలి అనుకుంటే... దానికి తగినట్టుగా ఉత్తమ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ లేదా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ చదవాలి, అప్పుడే అది సాధ్యపడుతుంది. అందుకే విదేశాలకు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులు ముందునుంచే ఈ విషయాలపై ఆలోచన, అవగాహన పెంచుకోవాలి. దాంతోపాటు మరికొన్ని విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి. అవేంటో ఒక్కొక్కటిగా పరిశీలిస్తే...
బడ్జెట్ ఏంటి?
విదేశాల్లో చదవడం ఆసక్తికరం, ప్రయోజనకరమైనది మాత్రమే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా. అందువల్ల ఏదైనా దేశానికి వెళ్లేటప్పుడు బడ్జెట్ జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఫీజు విషయానికే వస్తే... యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా లాంటి ఇప్పటికే డిమాండ్ అధికంగా ఉన్న దేశాల్లో ఇవి కాస్త ఎక్కువే! కాలేజీ ఫీజుకు అదనంగా అక్కడ ఉండటానికి, రవాణా ఖర్చులు కూడా కలిపితే ఇంకా ఎక్కువ డబ్బు అవసరం పడుతుంది.
* ఇలా చదవాలి అనుకునేటప్పుడు విద్యారుణాలు తీసుకోవడం ఉత్తమ పద్ధతి. అయితే తిరిగి చెల్లించే విధానాల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి.
* చదువుకుంటూ పార్ట్‌టైం ఉద్యోగం చేయవచ్చు. అయితే దీనివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. ఒకవేళ అలా చేయాల్సి వస్తే నియమ నిబంధనలు తెలుసుకోవాలి. చాలా దేశాల్లో విదేశీ విద్యార్థులు వారానికి నిర్దేశిత గంటలు మాత్రమే పనిచేయాలి. ఇలా చేస్తే వచ్చే డబ్బులు వారు అక్కడ జీవించడానికి సరిపడేలా ఉంటాయంతే.
* ఫీజుకు సాయపడేలా స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేయవచ్చు. అందుకు తగిన అవకాశాలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలి.
ఉద్యోగావకాశాలు
ఏ దేశంలో చదవాలో నిర్ణయించుకున్నాక... చదివాక లభించే ఉద్యోగావకాశాల గురించి ఆలోచించాలి. కొన్ని దేశాల్లో చదివే కోర్సులను బట్టి పనిచేసేందుకు లభించే గడువు ఆధారపడుతుంది. ఉదాహరణకు యూఎస్‌ఏలో స్టెమ్ సంబంధిత కోర్సులు చదివితే వచ్చే పని గడువు 3 ఏళ్లు. అదే స్టెమ్ కాని కోర్సులు చదివితే వచ్చే గడువు ఏడాది మాత్రమే. అలాగే భవిష్యత్తులో శాశ్వతంగా నివాసం ఉండే అవకాశాల గురించి సైతం ఆలోచించాలి.
ఏ దేశమో నిర్ణయించేటప్పుడు..
అన్నీ ఆలోచించాక ఏ దేశం మీకు నప్పుతుందో నిర్ణయించుకోవాలి. తర్వాత అక్కడ నచ్చిన కోర్సు అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. నచ్చిన యూనివర్సిటీ అక్రిడిటేషన్లు సరిచూడాలి. అందులో చదివిన విద్యార్థులు ఎంత త్వరగా ఉద్యోగం సాధించారు, సరాసరి ఎంత ప్యాకేజీ పొందుతున్నారనే విషయం తెలుసుకోవాలి. తర్వాత అకడమిక్ స్కోర్లను అనుసరించి స్కాలర్‌షిప్, అడ్మిషన్ దొరుకుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి (అవసరం అనుకుంటే సహాయక ఏజెన్సీలను సంప్రదించవచ్చు). పూర్వ విద్యార్థులతో సోషల్ మీడియా ద్వారా మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
ఏం చదవాలి?
కొందరు చిన్ననాటి నుంచే ఏం చదవాలి అనే విషయంపై బాగా అవగాహనతో ఉంటారు. మరికొందరికి ఉన్నత విద్యాభ్యాసానికి వచ్చే సమయానికి ఒక ఆలోచన కలుగుతుంది. కానీ కొందరు వెళ్లడానికి ముందు కూడా ఏం చదవాలో నిర్ణయానికి రాలేరు, ఈ పద్ధతి సరి కాదు. ఒకసారి ఈ కింది పాయింట్లు సరిచూసుకుంటే... మనమేం కావాలి అనుకుంటున్నామో ఒక అవగాహన వస్తుంది.
* చదువు పూర్తవుతూనే ఉన్నత ఉద్యోగావకాశాలు కల్పించే కోర్సులను ఎన్నుకోవచ్చు. ఉదాహరణకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిజినెస్ ఎనలిటిక్స్ లాంటి కోర్సులు ప్రస్తుతం చాలా డిమాండ్‌లో ఉన్నాయి. వీటికి ఇండియాలోనే కాక విదేశాల్లోనూ అధిక డిమాండ్ ఉంది. ఇటువంటి వాటిల్లో చేరవచ్చు.
* వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. సబ్జెక్టు గురించి, తదుపరి దొరికే అవకాశాల గురించి తెలుసుకోవచ్చు.
* ఉన్న కోర్సులను ఒక జాబితాగా రాసుకుని మీకు చదివే ఆసక్తి లేని వాటిని పక్కకు తీసేయండి. దీనివల్ల మీకు ఏం కావాలో తెలుసుకోవడం మరింత సులభమవుతుంది.
* బాగా ఆసక్తిగా అనిపించే ఉద్యోగావకాశాలను గుర్తించండి. అప్పుడు కావాల్సిన కోర్సు ఏమిటో నిర్ణయించుకోవడం సులభమవుతుంది.
* కొన్ని దేశాల్లో కొన్ని ప్రత్యేక కోర్సులకు డిమాండ్ అధికంగా ఉంటుంది. అక్కడ చదివి వచ్చిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. అలా ఏమైనా చేయాలి అనుకుంటున్నారా అనేది చూసుకోవాలి.
పరిస్థితులు ఎలా?
ఎక్కడికి వెళ్లాలి అనేది నిర్ణయించుకునే ముందు అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయనేది పరిశీలించాలి. అస్సలు అలవాటు లేని పరిస్థితుల్లో జీవించడం అంత సులభం కాదు. ఉదాహరణకు చల్లటి వాతావరణం కలిగిన ప్రదేశాల్లో ఉండటం కష్టం అనుకుంటే... అటువంటి దేశాలను జాబితా నుంచి తీసేయండి.
* అక్కడ ఉండటానికి అయ్యే ఖర్చుల గురించి కూడా తెలుసుకోవాలి.
* జీవన పరిస్థితులు, సామాజిక రక్షణ వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ నేరాల సగటు ఎక్కువగా ఉందనిపిస్తే.. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉండటం మంచిది. చాలా విద్యాసంస్థలు ఉత్తమ రక్షణ నిబంధనలతో విద్యార్థులకు వసతి ఏర్పాటు చేస్తుంటాయి. అయితే ఇలా ఉండటం వల్ల ఖర్చులు మరింత పెరుగుతాయి.
దరఖాస్తు-పరీక్ష సన్నద్ధత
* ఎంచుకున్న కోర్సులో చేరేందుకు రాయాల్సిన పోటీ పరీక్షలేంటో చూడాలి. అలాగే ఇంగ్లిష్ స్పీకింగ్ టెస్ట్‌ల గురించి అవగాహన పెంచుకోవాలి.
* సాధారణంగా టెక్నికల్ కోర్సులకు శాట్/జీఆర్‌ఈ అవసరం అవుతాయి. (శాట్ అండర్‌గ్రాడ్యుయేట్‌కు, జీఆర్‌ఈ గ్రాడ్యుయేట్‌కు). జీమాట్‌ను మేనేజ్‌మెంట్ కోర్సుల కోసం బిజినెస్ స్కూల్స్ అడుగుతాయి.
* ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం విద్యార్థి ఐఈఎల్‌టీఎస్/టోఫెల్, డీఈటీ/పీటీఈ రాయాల్సి ఉంటుంది.
* ఈ పరీక్షల్లో నెగ్గేందుకు పూర్తిస్థాయి సన్నద్ధత అవసరం. అప్పుడే ప్రయత్నం చేయాలి.
వెళ్లే ముందు...
వీసా అప్రూవ్ అవ్వగానే చేయాల్సిన ఏర్పాట్ల జాబితా సరిచూడాలి. చెక్ చేసుకోవాలి. అక్కడ దిగగానే, గమ్యాన్ని చేరుకున్నాక చేయాల్సిన పనులు తెలుసుకోవాలి.
* తక్కువ ధరలో దొరికేలా ముందే విమాన టికెట్లు బుక్ చేసుకోవాలి.
* తీసుకెళ్లాల్సిన వస్తువుల జాబితా ముందే సిద్ధం చేసుకోవాలి.
* అక్కడికి వెళ్లిన నాటి నుంచి ఇబ్బందిలేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ముందే తీసుకోవాలి.
* కమ్యూనికేషన్‌కు ఇబ్బంది లేకుండా ఇంటర్నేషనల్ సిమ్‌కార్డ్ తీసుకోవాలి.
* ఫోరెక్స్, ట్రావెల్ కార్డులు సిద్ధం చేసుకోవాలి.
* వసతి సదుపాయం వివరాలు కనుక్కుని ముందుగానే బుక్ చేసుకోవాలి.
* ఎయిర్‌పోర్ట్ నుంచి గమ్యస్థానానికి వెళ్లేందుకు ట్రాన్స్‌పోర్ట్ సిద్ధం చేసుకోవాలి.
అవసరమైన డాక్యుమెంట్లు..
1. సర్టిఫికెట్లు (మార్క్ షీట్స్, ప్రొవిజినల్స్ తదితరాలు)
2. టెస్ట్ స్కోరు(జీఆర్‌ఈ, ఐఈఎల్‌ఈఎస్, టోఫెల్)
3. రెజ్యూమె
4. స్టేట్‌మెంట్ ఆప్ పర్పస్
5. రికమెండేషన్ లెటర్స్ (రెండు లేదా మూడు)
6. పాస్‌పోర్ట్ 7. పని అనుభవ ధ్రువపత్రం (ఏదైనా ఉంటే..)
8. ఫైనాన్షియల్ ప్రూఫ్
* కనీసం నాలుగైదు యూనివర్సిటీలకు దరఖాస్తు చేస్తే ఏదైనా ఒక దానిలో ప్రవేశం దొరికేందుకు అధిక అవకాశం ఉంటుంది.
* స్కాలర్‌షిప్ అవకాశం ఉంటే.. దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
* దరఖాస్తు ఫీజు చెల్లింపు ఎలా చేయాలో తెలుసుకోవాలి. అంతర్జాతీయ పేమెంట్లు చేసే అవకాశం ఉన్న క్రెడిట్ కార్డు దగ్గర ఉంచుకోవాలి.
* స్టూడెంట్ వీసాకు అవసరమైన డాక్యుమెంట్లు దగ్గర ఉంచుకోవాలి.
* ఐ20/ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ/ సీఏఎస్/ సీఓఈ కనుక వచ్చిందంటే... వీసా పిటిషన్ వేసేందుకు లేదా వీసా అపాయింట్‌మెంట్ పొందేందుకు వీలైనంంత త్వరగా ప్రయత్నించాలి.
దరఖాస్తు ప్రక్రియ
* యూనివర్సిటీని నిర్ణయించుకోగానే వీలైనంత త్వరగా దరఖాస్తు పంపేందుకు ప్రయత్నించాలి.
* త్వరగా దరఖాస్తు చేసినవారికి స్కాలర్‌షిప్ దొరికే అవకాశాలు అధికం.
* దరఖాస్తు సమయంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా ముందే కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధం చేసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Uppal Bhagayat plots: ‘ఉప్పల్ భగాయత్’లో ప్లాట్లకు మరోసారి ఈ-వేలం
-
Sports News
IPL 2023: వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్
-
Politics News
Rahul Gandhi: మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్ వ్యంగ్యాస్త్రాలు
-
General News
YS Avinash Reddy: అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్.. మంజూరు చేసిన హైకోర్టు
-
India News
45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక
-
Sports News
IPL Finals: ఆఖరి బంతికి అద్భుతం.. అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్స్ ఇవే!