యూకేలో వైద్యవిద్య ఎలా?

ఇంటర్మీడియట్‌ చదువుతున్నాను. యూకే లేదా జర్మనీలో ఎంబీబీఎస్‌ చేయాలనుంది. విదేశీ యూనివర్సిటీల వివరాలను ఎలా తెలుసుకోవాలి.

Updated : 14 Nov 2022 03:43 IST

ఇంటర్మీడియట్‌ చదువుతున్నాను. యూకే లేదా జర్మనీలో ఎంబీబీఎస్‌ చేయాలనుంది. విదేశీ యూనివర్సిటీల వివరాలను ఎలా తెలుసుకోవాలి. అక్కడ పారామెడికల్‌ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయా?

- ఆకాంక్ష

* యూకేలో మెడిసిన్‌ కోర్సు చదవాలంటే ఇంటర్మీడియట్‌ (బైపీసీ)లో అత్యుత్తమ ప్రతిభతో పాటు ఐఈఎల్‌టీఎస్‌ పరీక్షలో కనీసం 7 స్కోరు సాధించాలి. ఈ పరీక్షలో ఉన్న నాలుగు సెక్షన్లలో (రీడింగ్‌, రైటింగ్‌, స్పీకింగ్‌, లిజనింగ్‌) కనీసం 6.5 స్కోరు రావాలి. లేదా ఐబీ (ఇంటర్నేషనల్‌ బ్యాకలోరియట్‌) పరీక్షలో కనీసం 40 స్కోరు పొందాలి. కొన్ని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశానికి యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ టెస్ట్‌ని ఆన్‌లై న్‌లో నిర్వహిస్తారు. యూకే క్లినికల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో వెర్బల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌, ఆబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌, డెసిషన్‌ అనాలిసిస్‌, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంటుల్లో ప్రశ్నలు ఉంటాయి.

జర్మనీ విషయానికొస్తే ఇంటర్మీడియట్‌ లో అత్యుత్తమ ప్రతిభతో, ఇంగ్ల్లిష్‌ ప్రావీణ్యంతో పాటు జర్మన్‌ భాషలో కూడా కొంత ప్రవేశం అవసరం. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లపై మంచి పట్టు, మ్యాథ్స్‌ ప్రాథమికాంశాల పరిజ్ఞానం ఉండాలి. వీటితో పాటు కొన్ని యూనివర్సిటీలు ప్రత్యేక నియామక పద్ధతులను అనుసరిస్తాయి. విదేశీ యూనివర్సిటీల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాల ప్రామాణికత తెలుసుకోవడానికి ప్రపంచ ర్యాంకింగ్‌ వెబ్‌సైట్‌లను సందర్శించాలి. విదేశాల్లో కూడా పారా మెడికల్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు పారా మెడికల్‌ కోర్సును ఏ దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలో చేయాలనుకొంటున్నారో ఆ వర్సిటీ వెబ్‌సైట్‌కు వెళ్లి కావాల్సిన వివరాలను తెలుసుకోండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని