యూకే పిలుస్తోంది!
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థులను యూఎస్‌ఏ తర్వాత అంతగా ఆకర్షిస్తోంది యునైటెడ్ కింగ్‌డమ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్సిటీల్లో చాలా సంస్థలు యూకేలో ఉన్నాయి.
విదేశాలకు వెళ్లి చదవాలనుకునే విద్యార్థులను యూఎస్‌ఏ తర్వాత అంతగా ఆకర్షిస్తోంది యునైటెడ్ కింగ్‌డమ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ యూనివర్సిటీల్లో చాలా సంస్థలు యూకేలో ఉన్నాయి. అంతేకాదు... అక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్ సొసైటీలు సైతం ఉన్నాయి. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా అవి వారికి అండగా ఉంటాయి. ఇంకా యూకేలో ఉన్నత విద్య గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?
ఇతర దేశాలతో పోల్చుకుంటే యూకే యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందడం కాస్త తేలిక అనే చెప్పాలి. ఒక్కసారి సీటు తెచ్చుకుంటే... అక్కడకు వెళ్లి, అన్నీ అమర్చుకుని కుదురుకునే వరకూ యూనివర్సిటీ విద్యార్థికి సహాయకారిగా ఉంటుంది. తక్కువ సమయంలోనే డిగ్రీ అందుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువ. అకడమిక్ నాణ్యతకు ఇక్కడి విద్యాసంస్థలు పేరు పొందాయి. అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్లు పొందే అవకాశాలున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే వీసా సులభంగా దొరుకుతుంది. సాంస్కృతికపరంగానూ ఎన్నో భిన్నత్వాలు కనిపిస్తాయి. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేయవచ్చు.
ప్రవేశాలు
యూకేలో ప్రధానంగా రెండు ఇన్‌టేక్స్ ఉన్నాయి.
* ఫాల్ ఇన్‌టేక్ - సాధారణంగా ఆగస్టులో ప్రారంభమై సెప్టెంబరుతో ముగుస్తుంది. ఇది అతిపెద్ద ఇన్‌టేక్. ఈ సమయంలోనే అకడమిక్ సంవత్సరం ప్రారంభమవుతుంది. అన్ని కోర్సులూ అందుబాటులో ఉంటాయి.
* స్ప్రింగ్ ఇన్‌టేక్ - జనవరిలో ప్రారంభమవుతుంది. చాలావరకూ కోర్సులు ఈ సమయంలోనూ ప్రారంభం కావడంతో దీన్ని కూడా ప్రధానమైన ఇన్‌టేక్‌గా చెబుతారు.
* ఇవేకాకుండా సమ్మర్ ఇన్‌టేక్ కూడా ఉంటుంది. ఈ సమయంలో కొన్ని కోర్సులు మాత్రమే ఉండటం వల్ల దీన్ని చిన్న ఇన్‌టేక్‌గా చెబుతారు.
యూనివర్సిటీలు - కోర్సులు
యూకేలో దాదాపు 130 యూనివర్సిటీలున్నాయి. ఇందులో ఏది ఎంచుకోవాలన్నా ఒకసారి అన్నీ ఆలోచించుకోవాలి. నిర్దిష్ట అంశాలను బట్టి ఈ వర్సిటీలను కొన్ని రకాలుగా చెప్పుకోవచ్చు.
సంప్రదాయ యూనివర్సిటీలు : ఇవి 16వ శతాబ్దానికి ముందు ఏర్పాటుచేసినవే కాదు.. అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉన్నవి కూడా. చారిత్రక కట్టడాలకు, అప్పటి తరహా క్యాంపస్‌లకు ప్రసిద్ధి. ప్రధానంగా సైన్స్, ఫిలాసఫీ, థియాలజీ కోర్సులపై దృష్టి సారిస్తున్నాయి.
ఆధునిక వర్సిటీలు : ఇవి ఎప్పుడో ఏర్పాటు చేసినా, ఈ మధ్యనే యూనివర్సిటీ గుర్తింపు పొందినవి. ఇతర సంస్థలతో పోలిస్తే చిన్నవి, పట్టణాలు - చిన్నపాటి నగరాల్లో ఉండేవి. అయితే వీటికుండే బలాలతో పోటీని తట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకున్నాయి.
రస్సెల్ గ్రూప్ వర్సిటీలు : యూకేలో ఉన్న టాప్ 24 బ్రిటిష్ రిసెర్చ్ యూనివర్సిటీల సమూహం ఇది. ఇందులో కొన్ని సంప్రదాయ వర్సిటీలు కూడా ఉన్నాయి. ఇవి ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో ముందంజలో ఉన్నాయి.
యూకే ప్రస్తుతం అధికశాతం విద్యార్థులు ఎంచుకుంటున్న టాప్ కోర్సులు
* ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్
* మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్
* కంప్యూటర్ సైన్స్
* ఇంజినీరింగ్
* ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
ఫీజు
అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు ఫీజు రూ.15 లక్షల నుంచి రూ.40 లక్షల వరకూ ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు రూ.13 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ ఉంటుంది.
సన్నద్ధత
* యూకే విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం జీఆర్‌ఈ, శాట్ వంటివి అక్కర్లేదు.
* ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఐఈఎల్‌టీఎస్, టోఫెల్, పీటీఈ వంటి వాటిల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని రాయవచ్చు.
* కొన్ని యూనివర్సిటీలకు ఈ ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఎంచుకున్న వర్సిటీ ఆ స్కోరు అడుగుతుందో లేదో గమనించి దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు
ఫాల్ ఇన్‌టేక్‌కు దరఖాస్తు చేయదలిచేవారు మార్చి నెలాఖరులోపు చేసుకోవడం మంచిది. అలాగే స్ప్రింగ్ ఇన్‌టేక్‌లో వెళ్లాలి అనుకునేవారు నవంబర్ ముగిసేలోగా దరఖాస్తు పెట్టుకోవాలి. సమ్మర్ ఇన్‌టేక్ దరఖాస్తు గడువు ఏప్రిల్‌తో ముగుస్తుంది.
దరఖాస్తు ప్రక్రియ
ఎక్కడ చేరాలో నిర్ణయించుకున్నాక వీలైనంత త్వరగా దరఖాస్తు పంపాలి. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్, స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్, మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ లెటర్, లెటర్ ఆఫ్ రికమెండేషన్ సహా అన్నీ పంపితే విద్యార్థికి అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ అందుతుంది. ఒకవేళ ఏవైనా డాక్యుమెంట్లు లేకపోతే కండిషనల్ ఆఫర్ లెటర్ అందుతుంది. అప్పుడు మళ్లీ అన్ని డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అలా అన్‌కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చిన విద్యార్థులు యూనివర్సిటీ నిర్వహించే ‘క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ’కి హాజరుకావాలి. అందులో నెగ్గితే విద్యార్థి సంస్థ చెప్పిన కొంత మొత్తం ఫీజు ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్స్, మెడికల్ రిపోర్టులు సీఏఎస్ లెటర్ కోసం పంపాలి. సీఏఎస్ అంటే విద్యార్థిని యూనివర్సిటీలోకి తీసుకున్నట్లుగా వచ్చే నిర్ధారణ పత్రం. వీసాకు దరఖాస్తు చేయడానికి ఈ డాక్యుమెంట్ తప్పనిసరి.
వీసా సన్నద్ధత: సీఏఎస్ లభించిన తర్వాత విద్యార్థి వీసాకు దరఖాస్తు చేయాలి. ఇదంతా ఆన్‌లైన్ ప్రక్రియ. యూనివర్సిటీకి ఇచ్చిన మొత్తం అకడమిక్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు అన్నీ వీఎఫ్‌ఎస్ (వీసా ఫెసిలిటేషన్ సర్వీసెస్)కు కూడా వెరిఫికేషన్ కోసం పంపాలి. అవి అప్రూవ్ అయితే విద్యార్థి పాస్‌పోర్ట్ స్టాంపింగ్‌కు వెళ్తుంది.
వీసా ప్రక్రియ సమయం
* యూకే వీసా కోసం దాదాపు 2 నుంచి 6 వారాల సమయం పట్టొచ్చు. ఇది ఒక్కో దరఖాస్తుకు ఒక్కోలా ఉంటుంది.
* ‘ప్రయారిటీ సర్వీసెస్’ను ఉపయోగించుకుని త్వరగా వీసా పొందేందుకు కొంత అదనపు రుసుము చెల్లిస్తే ఇంకా వేగంగా వీసా పొందవచ్చు. 5 వ్యాపార దినాల్లో వీసా అపాయింట్‌మెంట్ ఇస్తారు.
* మరుసటి రోజే అందేలా ‘సూపర్ ప్రయారిటీ’ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగావకాశాలు
డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ... ఇలా యూకేలో ఏ చదువు పూర్తిచేసినా పీఎస్‌డబ్ల్యూ వీసాకు దరఖాస్తు చేయడానికి వీలుంటుంది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ తొలుతగా రెండేళ్ల పని అనుమతి లభిస్తుంది.
వెళ్లేముందు...
* అక్కడికి వెళ్లే ముందే ట్యూషన్ ఫీజు చెల్లించేయడం మంచిది.
* వసతి ఏర్పాట్లలో తొలుత వచ్చినవారికి ప్రాధాన్యం ఉండటం వల్ల ముందే అంతా సిద్ధం చేసుకోవాలి.
* వెళ్లే ముందే ఫారెక్స్, కార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలి.
* సీఏఎస్ లెటర్ అందగానే విమాన టికెట్ బుక్ చేసుకోవాలి. అప్పుడు తక్కువ ధరకు లభించడమే కాకుండా లగేజ్ దగ్గర ఇబ్బంది లేకుండా ఉంటుంది.
* ఇమిగ్రేషన్ దగ్గర అవసరమైతే చూపించేందుకు అకడమిక్, ఫైనాన్షియల్, సీఏఎస్ లెటర్లు దగ్గర ఉంచుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Yashasvi Jaiswal: మైదానంలో నా ఆలోచనంతా అలానే ఉంటుంది: యశస్వి జైస్వాల్
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ