ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నాను. ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్‌ దొంగతనానికి గురైంది. డూప్లికేట్స్‌ తీసుకున్నాను. అయితే ఆ సర్టిఫికెట్స్‌ అన్నింటిపై ​​​​​​​

Published : 05 Jul 2022 00:25 IST

నేను ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అవుతున్నాను. ఇటీవల బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్‌ దొంగతనానికి గురైంది. డూప్లికేట్స్‌ తీసుకున్నాను. అయితే ఆ సర్టిఫికెట్స్‌ అన్నింటిపై డూప్లికేట్‌ అని ప్రింట్‌ అయి ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు రాయడానికి నాకు అర్హత ఉంటుందా?

- ఒక అభ్యర్థి

జ: సర్టిఫికెట్స్‌పై డూప్లికేట్‌ అని ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్యా ఉండదు. అయితే మీరు ఇచ్చిన ఫిర్యాదు, దానికి పోలీసు శాఖవారు ఇచ్చిన రిపోర్ట్‌ మీ దగ్గర ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాయడానికి కచ్చితంగా అర్హత ఉంది. కంగారు పడకుండా బాగా ప్రిపేర్‌ అవ్వండి.

ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు హైదరాబాద్‌లో; ఆరో తరగతి ఆంధ్రప్రదేశ్‌లో; ఏడో తరగతి హైదరాబాద్‌లో చదివాను. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి స్థానికత వర్తిస్తుందా?

- బి. శివకృష్ణ

జ: ఆరో తరగతి ఆంధ్రప్రదేశ్‌లో చదివిన కారణంగా టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయడానికి స్థానికత వర్తించదు. మీరు నాన్‌లోకల్‌ కిందకు వస్తారు.

ప్రస్తుతం నేను ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం చదువుతున్నాను. టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుందా?

- మిథున్‌ చౌహాన్‌

జ: ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం పూర్తయ్యి, డిగ్రీ పట్టా మీ వద్ద ఉంటేనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్స్‌ పరీక్షలు రాయడానికి అర్హత ఉంటుంది.

help@eenadupratibha.net


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని