ఆ హార్మోన్‌ అధికమైతే అతి దీర్ఘకాయత్వం!

మానవ శరీరంలో అన్నిరకాల జీవక్రియలను సమన్వయం చేసేదే అంతఃస్రావ వ్యవస్థ. అందులోని గ్రంథులు రసాయన రాయబారులుగా పిలిచే హార్మోన్లను స్రవిస్తుంటాయి.

Published : 14 Mar 2024 01:00 IST

జనరల్‌ స్టడీస్‌ బయాలజీ

మానవ శరీరంలో అన్నిరకాల జీవక్రియలను సమన్వయం చేసేదే అంతఃస్రావ వ్యవస్థ. అందులోని గ్రంథులు రసాయన రాయబారులుగా పిలిచే హార్మోన్లను స్రవిస్తుంటాయి. నేరుగా రక్తం లోకి విడుదలయ్యే హార్మోన్లు నిర్ణీత కణజాలం మీద మాత్రమే ప్రభావం చూపుతాయి. తల్లి గర్భంలో శిశువు ఆవిర్భావం నుంచి పుట్టుక, పెరుగుదల, వయసుకు తగినట్లుగా  శరీరంలో జరిగే మార్పులన్నీ నిర్ణీత హార్మోన్లతో ముడిపడి ఉంటాయి. శరీరంలో వివిధ భాగాల్లో ఉండే గ్రంథులు, అవి స్రవించే హార్మోన్‌లు, వాటి ఉపయోగాలు, స్రావాల పరిమాణం ఎక్కువైనా, తక్కువైనా తలెత్తే సమస్యలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి. గ్రంథుల అమరిక తీరు, ఒకే రకమైన హార్మోన్‌ పిల్లల్లో, పెద్దల్లో వేర్వేరుగా ప్రభావం చూపే విధానం, పురుషులు, స్త్రీలలో ఉండే వైవిధ్యాల గురించి తగిన పరిజ్ఞానం ఉండాలి.

అంతఃస్రావ వ్యవస్థ (హార్మోన్లు)

న శరీరంలో ప్రతిక్షణం అనేక జీవక్రియలు క్రమపద్ధతిలో జరుగుతాయి. అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేస్తూ పలు విధులు నిర్వహిస్తున్నాయి. మన శరీరం ఎల్లప్పుడూ నియంత్రణ, సమన్వయంతో ఉంటుంది. దీనిని నిర్వర్తించడానికి శరీరంలో రెండు వ్యవస్థలు ఉన్నాయి. అవి 1) అంతఃస్రావ వ్యవస్థ 2) నాడీ వ్యవస్థ.
అంతఃస్రావ వ్యవస్థ హార్మోన్‌లను స్రవిస్తూ నియంత్రణ సమన్వయాన్ని నిర్వహిస్తుంది.

1. అంతఃస్రావ వ్యవస్థకు సంబంధించి కింది వ్యాకాల్లో సరైంది ఏది?

ఎ) ఇది శరీరంలో నియంత్రణ సమన్వయం చేసే ఒక వ్యవస్థ.
బి) అంతఃస్రావ వ్యవస్థలో వివిధ గ్రంథులు హార్మోన్‌లను స్రవిస్తాయి.
సి) అంతఃస్రావ వ్యవస్థ శరీరం లోపల జరిగే వివిధ పనులను నిర్వహిస్తుంది.
డి) అంతఃస్రావ గ్రంథులకు నాళాలు ఉండి ఎంజైమ్‌లను స్రవిస్తాయి.
1) ఎ, బి  2) సి, డి   3) ఎ, బి, సి  4) బి, డి

2. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) వినాళ గ్రంథులు - థైరాయిడ్‌, పిట్యూటరీ గ్రంథులు
బి) నాళగ్రంథులు - కాలేయం, లాలాజల గ్రంథులు
సి) మిశ్రమ గ్రంథులు - క్లోమం, బీజకోశాలు
1) 2 జతలు 2) 3 జతలు
3) ఒక జత 4) ఏదీకాదు

3. కిందివాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.

ఎ) అంతఃస్రావ గ్రంథులను వినాళ గ్రంథులు అంటారు.
బి) హార్మోన్‌లను రసాయన వార్తావాహకాలు అంటారు.
సి) ఒక హార్మోన్‌ అన్ని అవయవాలపై పనిచేస్తుంది.
డి) హార్మోన్‌లు రక్తంలోకి విడుదలై వివిధ భాగాలకు చేరతాయి.
1) సి     2) బి     3) బి, డి    4) ఎ, సి

4. మన దేహంలో అంతఃస్రావ గ్రంథులు ఉండే   ప్రదేశాల ఆధారంగా కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) పిట్యూటరీ గ్రంథి     1) మెడ భాగంలో
బి) థైరాయిడ్‌ గ్రంథి      2) మెదడులో
సి) పారా థైౖరాయిడ్‌ గ్రంథులు 3) మూత్రపిండాలపైన
డి) అడ్రినల్‌ గ్రంథులు    4) జీర్ణాశయం కింద
ఇ) క్లోమం            5) థైరాయిడ్‌ గ్రంథికి అతుక్కుని
1) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5  
2) ఎ-2, బి-1, సి-5, డి-3, ఇ-4
3) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5  
4) ఎ-5, బి-4, సి-3, డి-2, ఇ-1

5. వివిధ జీవుల్లో హార్మోన్ల విధులకు సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.

ఎ) కప్ప లార్వా రూపవిక్రియ చెందడానికి థైరాక్సిన్‌ హార్మోన్‌ అవసరం.
బి) కీటకాల్లో నిర్మోచనం చెందడానికి ఎక్డిసోన్‌ అనే హార్మోన్‌ అవసరం.
   సి) కీటకాల్లో ఆహారం, సంపర్కం కోసం ‘ఫిరోమోనులు’ అనే హార్మోన్‌లు ఉపయోగపడతాయి.
1) ఎ, బి   2) బి, సి  
3) ఎ మాత్రమే     4) ఎ, బి, సి

6. కింది వాక్యాల్లో పిట్యూటరీ గ్రంథి గురించి సరైంది ఏది?

ఎ) ఇది మెదడులో హైపోథలామస్‌ కింద ఉంటుంది.
బి) దీన్ని మాస్టర్‌ గ్రంథి, ముఖ్యమైన గ్రంథి అని పిలుస్తారు.
సి) ఇది పూర్వ, పర లంబికలుగా విభజితమై ఉంటుంది.
డి) ఇది ఇన్సులిన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తుంది.
1) ఎ, బి, సి   2) ఎ, బి   3) డి   4) సి, డి

7. పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్‌ల మారుపేర్ల గురించి కిందివాటిని సరైన క్రమంలో అమర్చండి.

ఎ) సొమాటోట్రోపిక్‌ 1) శిశు జనన హార్మోన్‌హార్మోన్‌
బి) ప్రొలాక్టిన్‌       2) పెరుగుదల హార్మోన్‌
సి) ఫాలిక్యులార్‌ 3) గామిటో కైనటిక్‌
స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌    ఫ్యాక్టర్‌
డి) ఆక్సిటోసిన్‌       4) యాంటీడైయూరిటిక్‌    హార్మోన్‌
ఇ) వాసోప్రెస్సిన్‌ 5) లాక్టోజెనిక్‌ హార్మోన్‌
1) ఎ-3, బి-4, సి-2, డి-1, ఇ-5    
2) ఎ-2, బి-5, సి-3, డి-1, ఇ-4
3) ఎ-2, బి-3, సి-1, డి-4, ఇ-5    
4) ఎ-4, బి-3, సి-2, డి-1, ఇ-5

8. కిందివాటిలో పిట్యూటరీ గ్రంథి స్రవించని హార్మోన్‌లు-

ఎ) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌   బి) గ్లైకోజన్‌  
సి) థైరాక్సిన్‌            డి) వాసోప్రెస్సిన్‌  
ఇ) థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌  
ఎఫ్‌) ప్రొలాక్టిన్‌  
1) ఎ, బి   2) ఇ, ఎఫ్‌   3) బి, సి  4) సి, డి

9. పెరుగుదల హార్మోన్‌కు సంబంధించి కిందివాటిలో సరైన వాటిని జతపరచండి.

ఎ) చిన్నపిల్లల్లో ఈ హార్మోన్‌ 1) ఆక్రోమెగాలిలోపం వల్ల    
బి) పెద్దవారిలో ఈ హార్మోన్‌ 2) ఆక్రోమిక్రియాలోపం వల్ల    
సి) పెద్దవారిలో ఈ హార్మోన్‌ 3) అతిదీర్ఘకాయత్వం ఎక్కువైతే    
డి) చిన్నపిల్లల్లో ఈ హార్మోన్‌ 4) మరుగుజ్జుతనం ఎక్కువైతే    
1) ఎ-2, బి-3, సి-1, డి-4  2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-1, బి-4, సి-3, డి-2  4) ఎ-4, బి-2, సి-1, డి-3

10. పిట్యూటరీ గ్రంథి స్రవించే కింది హార్మోన్‌ల పనితీరు, ఉపయోగం గురించి సరైన వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) సొమాటోట్రోపిక్‌ హార్మోన్‌ శరీరం పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
బి) ప్రొలాక్టిన్‌ శిశుజననం తర్వాత క్షీర ఉత్పత్తికి దోహదపడుతుంది.
సి) ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ సంయోగబీజాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
డి) ఇంటర్‌ స్టీషియల్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌   టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.
1) ఎ, బి, సి, డి  2) ఎ, సి 3) బి, డి 4) ఎ, బి, డి

11. కిందివాటిలో సరికాని వాక్యాలను ఎన్నుకోండి.

ఎ) వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల డయాబెటిస్‌ ఇన్‌సిపిడస్‌ వ్యాధి వస్తుంది.
బి) ఆక్సిటోసిన్‌ వల్ల శిశుజనన సమయంలో గర్భాశయ సంకోచ వ్యాకోచాలు కలుగుతాయి.
సి) ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ శరీర పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
డి) ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ వల్ల థైరాక్సిన్‌ హర్మోన్‌ విడుదలవుతుంది.
ఇ) ఫాలిక్యులార్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ను గామిటోకైనెటిక్‌ ఫ్యాక్టర్‌ అని అంటారు.
1) ఎ, బి, సి,  2) సి, డి, ఇ 3) సి, డి 4) బి, ఇ

12. కిందివాటిలో ఎన్ని జతలు సరైనవి?

ఎ) టైప్‌ - 1 డయాబెటిస్‌ - చిన్నపిల్లల్లో కలిగే మధుమేహం.
బి) టైప్‌ - 2 డయాబెటిస్‌ - పెద్దవారిలో కలిగే మధుమేహం              
సి) డయాబెటిస్‌ ఇనిసిపిడస్‌ - వాసోప్రెస్సిన్‌ లోపం వల్ల కలుగుతుంది.
డి) డయాబెటిస్‌ మిల్లిటస్‌ - గ్లైకోజన్‌ హార్మోన్‌ లోపం వల్ల కలుగుతుంది.
1) ఒక జత   2) రెండు జతలు
3) మూడు జతలు   4) నాలుగు జతలు

13. థైరాయిడ్‌ గ్రంథి గురించి కింది వాక్యాల్లో సరైనవి ఏవి?

ఎ) మన శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ గ్రంథి థైరాయిడ్‌.
బి) ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది.
సి) ఐయోడిన్‌ లోపం వల్ల థైరాయిడ్‌ గ్రంథికి కలిగే వ్యాధి గాయిటర్‌
డి) ఇది మెడ భాగంలో ఉంటుంది.
1) ఎ, బి, సి,     2) బి, డి  
3) ఎ, బి, డి   4) ఎ, బి, సి, డి

14. థైరాక్సిన్‌ హార్మోన్‌కు సంబంధించి కింది వాక్యాల్లో సరికాని వాటిని గుర్తించండి.

ఎ) ఇది మన శరీరంలో ఆధార జీవక్రియా రేటును నియంత్రిస్తుంది.
బి) దీని లోపం వల్ల చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి    క్రిటినిజమ్‌.
సి) పెద్దవారిలో ఈ హార్మోన్‌ లోపం వల్ల కలిగే వ్యాధి మిక్సోడిమా.
డి) ఈ హార్మోన్‌ ఎక్కువైతే కుషింగ్‌ సిండ్రోమ్‌ వ్యాధి వస్తుంది.
ఇ) వృద్ధుల్లో ఈ హార్మోన్‌ ఉత్పత్తి ఆగిపోతుంది.
1) బి, సి,  2) సి, డి  3) డి, ఇ  4) ఎ, బి, సి

15. కింది వాక్యాలను పరిశీలించి, సరైనవి గుర్తించండి.

ఎ) హైపర్‌ థైరాయిడిజమ్‌ను ఎక్సాఫ్తాల్మిక్‌ గాయిటర్‌ అంటారు.
బి) థైరాయిడ్‌ గ్రంథి థైరోకాల్సిటోనిన్‌ హార్మోన్‌ను స్రవిస్తుంది.
సి) హషిమోటో వ్యాధి థైరాయిడ్‌కు సంబంధించిన జన్యుసంబంధ వ్యాధి.
1) ఎ, బి  2) ఎ మాత్రమే 3) ఎ, బి, సి 4) ఏదీకాదు

16. శరీరంలో అంతఃస్రావ గ్రంథులు తల నుంచి కింది వైపు వివిధ భాగాల్లో అమరి ఉండే సరైన విధానాన్ని గుర్తించండి.

1) పిట్యూటరీ గ్రంథి - థైరాయిడ్‌ గ్రంథి - బీజకోశాలు - అడ్రినల్‌ గ్రంథులు - క్లోమం
2) థైరాయిడ్‌ గ్రంథి - క్లోమం - అడ్రినల్‌ గ్రంథులు - పిట్యూటరీ గ్రంథి - బీజకోశాలు
3) పిట్యూటరీ గ్రంథి - థైరాయిడ్‌ గ్రంథి - క్లోమం - బీజకోశాలు - అడ్రినల్‌ గ్రంథులు
4) బీజకోశాలు - పిట్యూటరీ గ్రంథి - థైరాయిడ్‌ గ్రంథి - అడ్రినల్‌ గ్రంథులు - క్లోమం

17. పారాథైరాయిడ్‌ గ్రంథుల గురించి కింది వాక్యాల్లో సరికానివి-

ఎ) ఇవి మెడ భాగంలో థైరాయిడ్‌ గ్రంథి కణ     జాలంలో ఇమిడి ఉంటాయి.
బి) ఇవి పారాథార్మోన్‌ అనే హార్మోన్‌ను స్రవిస్తాయి.
సి) ఇవి శరీరంలో అతిపెద్ద గ్రంథులు.
డి) ఇవి శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రిస్తాయి.
1) ఎ, బి   2) సి, డి   3) బి, సి  4) ఎ, డి

18. కింది జతలను సరైన పద్ధతిలో అమర్చండి.

ఎ) థైరాక్సిన్‌ హార్మోన్‌ 1) ఆస్టియైటిస్‌ ఫైబ్రోసా తక్కువైతే    
బి) థైరాక్సిన్‌ హార్మోన్‌ 2) పారాథైరాయిడ్‌ టెటని ఎక్కువైతే    
సి) పారాథార్మోన్‌ హార్మోన్‌ 3) మిక్సోడిమా తక్కువైతే  
డి) పారాథార్మోన్‌ హార్మోన్‌ 4) ఎక్సాఫ్తాల్మిక్‌ గాయిటర్‌ ఎక్కువైతే  
1) ఎ-2, బి-1, సి-3, డి-4  
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-2, డి-1  
4) ఎ-3, బి-2 సి-1, డి-4

సమాధానాలు

1-3; 2-2; 3-1; 4-2; 5-4; 6-1; 7-2; 8-3; 9-4; 10-1; 11-3; 12-3; 13-4; 14-3; 15-1; 16-3; 17-2; 18-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని