కరెంట్‌అఫైర్స్‌

సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ప్రఖ్యాత హిమాలయ పర్యాటక, తీర్థయాత్ర స్థలం జోషిమఠ్‌లో 14 హై రిస్క్‌ జోన్‌లను ఇటీవల గుర్తించారు. జోషిమఠ్‌ ఏ రాష్ట్రంలో ఉంది? (చమోలీ జిల్లాలో ఉన్న ఈ పట్టణాన్నే జ్యోతిర్మఠ్‌ అని కూడా పిలుస్తారు.

Published : 15 Mar 2024 00:25 IST

మాదిరి ప్రశ్నలు

సెంట్రల్‌ బిల్డింగ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ప్రఖ్యాత హిమాలయ పర్యాటక, తీర్థయాత్ర స్థలం జోషిమఠ్‌లో 14 హై రిస్క్‌ జోన్‌లను ఇటీవల గుర్తించారు. జోషిమఠ్‌ ఏ రాష్ట్రంలో ఉంది? (చమోలీ జిల్లాలో ఉన్న ఈ పట్టణాన్నే జ్యోతిర్మఠ్‌ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి 6150 అడుగుల (1875 మీటర్లు) ఎత్తులో జోషిమఠ్‌ నెలకొని ఉంది.)

జ: ఉత్తరాఖండ్‌


క్యాన్సర్‌పై అవగాహన పెంచడానికి ఏటా ఏ తేదీని ప్రపంచ క్యాన్సర్‌ నివారణ దినోత్సవంగా నిర్వహిస్తారు? (2022లో భారత్‌లో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్‌ కేసులు వెలుగు చూశాయని, క్యాన్సర్‌ కారణంగా 2022లో భారత్‌లో 9 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) ఇటీవల వెల్లడించింది. దేశంలోని పురుషుల్లో పెదవి, నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు ఎక్కువగా వెలుగు చూశాయని, మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార (సర్వైకల్‌) క్యాన్సర్లు అధికంగా నమోదయ్యాయని ఐఏఆర్‌సీ పేర్కొంది. అత్యధిక మరణాలకు ఈ రకాలే కారణమైనట్లు తెలిపింది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 2 కోట్ల క్యాన్సర్‌ కేసులు నమోదు కాగా, 97 లక్షల మరణాలు సంభవించినట్లు ఐఏఆర్‌సీ వెల్లడించింది.)

జ: ఫిబ్రవరి 4


కామన్వెల్త్‌ దేశాల అటార్నీలు, సొలిసిటర్‌ జనరల్‌ల సదస్సును 2024, ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? (ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకట రమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తదితరులు ఈ సదస్సుకు హాజరై ప్రసంగించారు.)

జ: దిల్లీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని