కరెంట్‌ అఫైర్స్‌

ఏ నగరంలోని మహారాజా శాయాజీరావ్‌ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకుని వార్తల్లో  నిలిచారు?

Published : 17 Mar 2024 01:42 IST

మాదిరి ప్రశ్నలు

  • ఏ నగరంలోని మహారాజా శాయాజీరావ్‌ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకుని వార్తల్లో  నిలిచారు? (2024, ఫిబ్రవరి 4న జరిగిన ఈ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ వర్చువల్‌గా     ప్రసంగించారు).

జ: బరోడా

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళ భౌతిక  శాస్త్రవేత్త జోనాధన్‌ మెక్‌డోవెల్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం 2023లో ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా జరిగిన ఉపగ్రహ ప్రయోగాలు ఎన్ని? (ఈ సంఖ్య 2022లో 2,485గా ఉండగా 2016లో కేవలం 216గా ఉంది. 1957లో  సోవియట్‌ యూనియన్‌ తొలిసారిగా స్ఫుత్నిక్‌-1 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించి చరిత్ర సృష్టించింది.)

జ: 2,917

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పరిధిలోని ఆరు ప్రాంతీయ కార్యాలయాలు శాస్త్రీయంగా జరిపిన అధ్యయనం ప్రకారం ఆయుర్వేదం ప్రపంచంలో ఎన్నో అత్యంత ఆమోదయోగ్యమైన వైద్య విధానంగా ఉంది? (ఈ క్రమంలో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) జాబితాలో ఆయుర్వేద వైద్య పారిభాషిక పదజాలాన్ని డబ్ల్యూహెచ్‌ఓ చేర్చింది. దీనికి సంబంధించిన ప్రతిని ఇటీవల దిల్లీలో ఆవిష్కరించింది. భారత్‌లో అయిదు వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆయుర్వేదానికి ప్రాచుర్యం కల్పించాలని డబ్ల్యూహెచ్‌ఓ తాజాగా  నిర్ణయించింది.)

జ: రెండో

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు