కరెంట్‌ అఫైర్స్‌

ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రపంచంలో అగ్రగామి సంపన్నుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు.

Published : 06 Apr 2024 00:13 IST

ఫోర్బ్స్‌ 2024 ప్రపంచ బిలియనీర్ల జాబితా ప్రకారం, ప్రపంచంలో అగ్రగామి సంపన్నుల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ 9వ స్థానంలో నిలిచారు. ఈయన సంపద 116 బిలియన్‌ డాలర్లు. భారత్‌లో రెండో సంపన్నుడైన గౌతమ్‌ అదానీ ఈ జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. ఆయన సంపద 84 బిలియన్‌ డాలర్లు.

ఫ్రాన్స్‌ విలాస వస్తువుల దిగ్గజం ఎల్‌వీఎంహెచ్‌ అధిపతి బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 233 బిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. ఎలాన్‌ మస్క్‌ (195 బి.డాలర్లు), అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ (194 బి.డాలర్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ (177 బి.డాలర్లు) నాలుగో స్థానంలో ఉన్నారు.


క్యాన్సర్‌ చికిత్సకు తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన సీఏఆర్‌ టీ-సెల్‌ థెరపీని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2024, ఏప్రిల్‌ 4న ప్రారంభించారు. ఈ జన్యు ఆధారిత చికిత్సా విధానాన్ని ఐఐటీ బాంబే, టాటా మెమోరియల్‌ సెంటర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.


ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు 121వ స్థానంలో నిలిచింది. గతంలో భారత్‌ 117వ ర్యాంకులో ఉంది. 2024, మార్చిలో ఫిఫా ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్లో ఆఫ్గనిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిపోవడంతో ర్యాంకు పడిపోయింది.


భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే ఇది 1.2 శాతం అధికం.


కరెంట్‌ అఫైర్స్‌ ఈబుక్స్‌ కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని