నోటిఫికేషన్స్‌

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది.

Published : 26 Apr 2024 00:24 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామ్‌-2024

న్యూదిల్లీలోని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (అసిస్టెంట్‌ కమాండెంట్‌) ఎగ్జామినేషన్‌-2024 నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌, సశస్త్ర సీమా బల్‌లో అసిస్టెంట్‌ కమాండెంట్‌ (గ్రూప్‌ ఎ) ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

మొత్తం పోస్టులు: 506.

ఖాళీలు: బీఎస్‌ఎఫ్‌- 186, సీఆర్‌పీఎఫ్‌- 120, సీఐఎస్‌ఎఫ్‌- 100, ఐటీబీపీ- 58, ఎస్‌ఎస్‌బీ- 42.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01-08-2024 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (పేపర్‌ 1, పేపర్‌ 2), ఫిజికల్‌ స్టాండర్డ్స్‌/ ఫిజికల్‌ ఎఫిషియన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.200 (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 14 మే 2024.

రాత పరీక్ష తేదీ: 04 ఆగస్టు 2024.

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in/


అడ్మిషన్స్‌

ఏపీ డీఈఈసెట్‌-2024

పీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం 2024-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్‌ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌)-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఏపీ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈఈసెట్‌)-2024

కోర్సు: డీఈఎల్‌ఈడీ (డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌)

అర్హతలు: కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనిష్ఠంగా సెప్టెంబరు 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

కేటగిరీ సీట్లు: మ్యాథమెటిక్స్‌- 25%, ఫిజికల్‌ సైన్స్‌- 25%, బయోలాజికల్‌ సైన్స్‌- 25%, సోషల్‌ స్టడీస్‌- 25%.

ఎంపిక ప్రక్రియ: డీఈఈఈసెట్‌లో సాధించిన ర్యాంకు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. దరఖాస్తు రుసుము: రూ.750.

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 08 మే 2024

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 09 మే 2024

ప్రవేశ పరీక్ష తేదీ: 24 మే 2024.

వెబ్‌సైట్‌: https://apdeecet.apcfss.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు