TS EAPCET: తెలంగాణ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 06 Feb 2024 16:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఈఏపీసెట్‌ (TS EAPCET 2024) షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 21న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు సెట్‌ కన్వీనర్ ప్రొఫెసర్‌ డీన్‌ కుమార్‌ వెల్లడించారు. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్‌ 6 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. మే 9 నుంచి 12 వరకు తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAPCET) పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేశారు. మంగళవారం సెట్‌ కమిటీ సమావేశంలో ఈ షెడ్యూల్‌ను ఆమోదించినట్లు ఆయన వెల్లడించారు. గతంలో టీఎస్‌ ఎంసెట్‌గా పేర్కొనే ఈ పరీక్షకు టీఎస్‌ ఈఏపీసెట్‌గా ఇటీవలే మార్పు చేయగా.. జేఎన్‌టీయూ-హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగనుంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని