TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థుల హవా.. టాపర్లు వీళ్లే..

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఫలితాల వివరాలను ఆమె వెల్లడించారు.

Updated : 25 May 2023 11:27 IST
ఎంసెట్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అనంతరం ఫలితాల వివరాలను ఆమె వెల్లడించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 80 శాతం, అగ్రికల్చర్‌&మెడికల్‌లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. ఇటీవల నెలకొన్న కొన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణలో అత్యంత జాగ్రత్త వహించామని చెప్పారు. అనుకున్న సమయానికి ఫలితాలు అందించేందుకు కృషి చేసిన అధికార యంత్రాంగానికి మంత్రి సబిత కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్‌ టాప్‌-10లో 8 మంది, అగ్రికల్చర్‌&మెడికల్ విభాగాల టాప్‌-10లో ఏడుగురు ఏపీ విద్యార్థులే ఉండటం గమనార్హం.

ఇంజినీరింగ్‌ టాపర్లు వీరే..

1. సనపల అనిరుధ్‌ (విశాఖపట్నం)
2. ఎక్కింటిపాని వెంకట మణిందర్‌ రెడ్డి (గుంటూరు)
3. చల్లా ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ)
4. అభినీత్‌ మాజేటి (కొండాపూర్‌)
5. పొన్నతోట ప్రమోద్‌కుమార్‌రెడ్డి (తాడిపత్రి)
6. మారదాన ధీరజ్‌కుమార్‌ (విశాఖపట్నం)
7. వడ్డే శాన్వితారెడ్డి (నల్గొండ)
8. బోయిన సంజన (శ్రీకాకుళం)
9. నంద్యాల ప్రిన్స్‌ బ్రన్హమ్‌రెడ్డి (నంద్యాల)
10. మీసాల ప్రణతి శ్రీజ (విజయనగరం) 

అగ్రికల్చర్‌&మెడికల్‌ టాపర్లు..

1. బూరుగుపల్లి సత్యరాజ జశ్వంత్‌ (తూర్పుగోదావరి జిల్లా)
2. నశిక వెంకటతేజ (చీరాల)
3. సఫల్‌లక్ష్మి పసుపులేటి (సరూర్‌నగర్‌)
4. దుర్గెంపూడి కార్తికేయరెడ్డి (తెనాలి)
5. బోర వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం)
6. దేవగుడి గురు శశిధర్‌రెడ్డి (హైదరాబాద్‌)
7. వంగీపురం హర్షిల్‌సాయి (నెల్లూరు)
8. దద్దనాల సాయి చిద్విలాస్‌రెడ్డి (గుంటూరు)
9. గంథమనేని గిరివర్షిత (అనంతపురం)
10. కొల్లబాతుల ప్రీతమ్‌ సిద్ధార్థ్‌ (హైదరాబాద్‌)


ఎంసెట్‌ అగ్రికల్చర్‌- మెడికల్‌ విభాగాలు..

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు - 94,589
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు - 20,743
పరీక్షకు హాజరైన విద్యార్థులు - 1,01,544
ఉత్తీర్ణత సాధించినవారు - 91,935 
ఉత్తీర్ణత శాతం - 86%
బాలురు ఉత్తీర్ణత శాతం - 84%
బాలికల ఉత్తీర్ణత శాతం - 87%

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం..

పరీక్షలకు దరఖాస్తు చేసిన తెలంగాణ విద్యార్థులు - 1,53,890
పరీక్షలకు దరఖాస్తు చేసిన ఏపీ విద్యార్థులు - 51,461
పరీక్షకు హాజరైన విద్యార్థులు - 1,95,275
ఉత్తీర్ణత సాధించినవారు - 1,57,879
ఉత్తీర్ణత శాతం - 80%
బాలురు ఉత్తీర్ణత శాతం - 79%
బాలికల ఉత్తీర్ణత శాతం - 82%


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని