పొరుగు ‘శబ్దం’ ఆరోగ్యానికీ హాని

కొందరు ఇంట్లో పెద్ద శబ్దంతో సంగీతం, పాటలు వింటుంటారు. ఇవి వినోదం కలిగించొచ్చు గానీ ఇరుగుపొరుగువారికి చిక్కులు తెచ్చిపెడతాయి. కేవలం ఇబ్బంది కలిగించటమే కాదు, ఆరోగ్యానికీ హాని చేస్తాయి. ఇలాంటి పొరుగు....

Updated : 28 Dec 2021 04:21 IST

కొందరు ఇంట్లో పెద్ద శబ్దంతో సంగీతం, పాటలు వింటుంటారు. ఇవి వినోదం కలిగించొచ్చు గానీ ఇరుగుపొరుగువారికి చిక్కులు తెచ్చిపెడతాయి. కేవలం ఇబ్బంది కలిగించటమే కాదు, ఆరోగ్యానికీ హాని చేస్తాయి. ఇలాంటి పొరుగు శబ్దాలతో తలనొప్పులు, నిద్రలేమి, కుంగుబాటు, ఆందోళన తలెత్తే అవకాశముందని డెన్మార్క్‌ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది. మెలకువ వచ్చేంత ఎక్కువగా లేకపోయినా కూడా ఈ చప్పుళ్లతో నిద్ర దెబ్బతింటుంది. ఇది మానసిక స్థితి, ఏకాగ్రత మీద విపరీత ప్రభావం చూపుతుంది. అంతేకాదు, శరీరాన్ని నిరంతరం ఒత్తిడికి ప్రతిస్పందించే స్థితిలోకీ నెడుతుంది. ఇదిలా ఉండగా నిద్ర సరిగా పట్టినప్పటికీ చుట్టుపక్కల చప్పుళ్లతో కీళ్లనొప్పులు, నిస్సత్తువ, గుండెజబ్బుల ముప్పూ ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని