ఒంటి మీదా ఒత్తిడి!

మానసిక ఒత్తిడి భావోద్వేగాల మీదే కాదు, శరీరం మీదా విపరీత ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, మధుమేహం, కుంగుబాటు, ఆందోళన, ఆస్థమా, మతిమరుపు వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఒత్తిడితో అకాల వృద్ధాప్యం, అకాల మరణం ముప్పూ ముంచుకొస్తుంది.

Updated : 04 Jan 2022 03:05 IST

మానసిక ఒత్తిడి భావోద్వేగాల మీదే కాదు, శరీరం మీదా విపరీత ప్రభావం చూపిస్తుంది. ఊబకాయం, మధుమేహం, కుంగుబాటు, ఆందోళన, ఆస్థమా, మతిమరుపు వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఒత్తిడితో అకాల వృద్ధాప్యం, అకాల మరణం ముప్పూ ముంచుకొస్తుంది. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం ఎంతైనా మంచిది. ఇందుకు యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏదో ఒక అంశం మీద మనసును కాసేపు కుదురుగా నిలిపి ఉంచినా మేలే. ఇలాంటి ఏకాగ్రతతో కూడిన పనులతో మెదడులోని అమిగ్దల భాగం అతిగా స్పందించటం తగ్గుతుంది. దీంతో మనసుకు మంచి విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె వేగం స్థిమిత పడుతుంది. రక్తంలోకి కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్లు చేరటం తగ్గుతుంది. ఫలితంగా అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి వ్యాధుల ముప్పులూ తగ్గుముఖం పడతాయి. జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని