గుండెకు ఫ్లూ టీకా రక్ష

ఏటా ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా) టీకా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుండటం తెలిసిందే. గుండెజబ్బులు గలవారికిది మరింత ముఖ్యం. అప్పటికే గుండె వైఫల్యం, మధుమేహం, ఆస్థమా వంటి సమస్యలుంటే ఫ్లూతో మరింత ఎక్కువవుతాయి మరి. ఫ్లూతో...

Published : 24 May 2022 00:34 IST

టా ఫ్లూ (ఇన్‌ఫ్లూయెంజా) టీకా తీసుకోవాలని డాక్టర్లు చెబుతుండటం తెలిసిందే. గుండెజబ్బులు గలవారికిది మరింత ముఖ్యం. అప్పటికే గుండె వైఫల్యం, మధుమేహం, ఆస్థమా వంటి సమస్యలుంటే ఫ్లూతో మరింత ఎక్కువవుతాయి మరి. ఫ్లూతో ముంచుకొచ్చే న్యుమోనియా, బ్రాంకైటిస్‌, ఊపిరితిత్తుల వైఫల్యం వంటి సమస్యల ముప్పూ ఎక్కువే. మరెలా? ఫ్లూ టీకాతో ఇలాంటి ఇబ్బందులను చాలావరకు తప్పించుకోవచ్చు. దీన్ని తీసుకున్న వారికి గుండెనొప్పి, పక్షవాతం, గుండెపోటు వంటివి వచ్చే అవకాశం సగటున 34% వరకు తగ్గుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్‌ టొరంటో తాజా అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా ఇటీవల గుండెజబ్బుల బారినపడ్డవారికి వీటి ముప్పు 45% వరకూ తగ్గుతుండటం విశేషం. పరిశోధకులు మొత్తం ఆరు ప్రయోగ పరీక్షల ఫలితాలను విశ్లేషించి ఈ విషయాన్ని గుర్తించారు. ఫ్లూ మూలంగా జ్వరం రావటం, గుండె వేగం పెరగటం, ఒంట్లో నీటి శాతం తగ్గటం వంటివన్నీ గుండె మీద ఎక్కువ భారం పడేలా చేస్తాయి. ఫ్లూ బారినపడకుండా చూసుకుంటే దీన్ని నివారించుకోవచ్చు. మరోవైపు ఫ్లూ టీకా రోగనిరోధక వ్యవస్థ, వాపు ప్రక్రియను అదుపులో పెడుతూ రక్తనాళాల్లో పూడికలు స్థిరంగా ఉండేలా చేస్తుంది. ఇలా పూడికలు విడిపోకుండా, పగలకుండా కాపాడుతుండొచ్చని అనుకుంటున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని