Published : 08 Jan 2020 00:59 IST

నున్నగా ఉంటే వస్తువులు జారుతాయేం?

ప్రశ్న: నునుపు తలం మీద వస్తువులు ఎందుకు జారుతాయి?

- టి.శ్యాంబాబు, కె.ఎస్‌.ఆర్‌.జడ్‌.పి పాఠశాల, మోర్తా

నేల మీద మనం లేదా వస్తువులు ఉన్నప్పుడు మన లేదా వస్తువుల ద్రవ్యరాశి వల్ల కలిగే భూమ్యాకర్షణబలం (Gravitational Force) నేల మీద నిట్ట నిలువుగా పడుతుంది.

అదే సమయంలో నేల వస్తువుల మీద లేదా మన మీద న్యూటన్‌ మూడో గమన సూత్రం ప్రకారం ప్రతిబలం (Opposite Force) పని చేస్తుంది. దీని వల్లనే మనం అడుగు తీసి అడుగు వేయగలుగుతాం.

నేల గరుకుగా ఉన్నట్లయితే ఘర్షణ ఏర్పడ్డం వల్ల అడుగు తీసేప్పుడు భూమి కేంద్రం వైపు కాకుండా ఓ ఏటవాలుగా మనం నేలను తాకుతాం. కాబట్టి ఆ నేల మీద ఎగుడుదిగుడు గరుకు వల్ల ఈ ఏటవాలు బలానికి విరుద్ధంగా కూడా ప్రతిబలం వస్తుంది.

కానీ నేల నునుపుగా ఉన్నట్లయితే ఈ ఏటవాలు బలాలకు విరుద్ధంగా ప్రతిబలం రాదు నిట్టనిలువుగానే వస్తుంది. ఆ సందర్భంలో భూమ్యాకర్షణ బలం మన శరీరానికి అవతల పడ్డం వల్ల మనం పడిపోవడమో లేదా జారిపోవడమో జరుగుతుంది.

- ప్రొ|| ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts