సైకిళ్ల కిలకిలలు!

మనకు సైకిల్‌ అంటే బోలెడంత ఇష్టం కదూ! మనం బుజ్జి సైకిల్‌ మీద కూర్చుని ట్రింగ్‌..ట్రింగ్‌మని బెల్‌ కొడుతూ...

Published : 16 Jun 2020 00:22 IST

నకు సైకిల్‌ అంటే బోలెడంత ఇష్టం కదూ! మనం బుజ్జి సైకిల్‌ మీద కూర్చుని ట్రింగ్‌..ట్రింగ్‌మని బెల్‌ కొడుతూ తొక్కుతూ ఉంటే.. అమ్మానాన్నలు తెగ ఆనందిస్తారు కదూ! మనలో కొందరు స్కూల్‌కూ రయ్‌..రయ్‌..మని సైకిల్‌పైనే వెళుతుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. పుణెలో ఓ సైకిల్‌ మ్యూజియం ఉంది. దీన్ని విక్రమ్‌ పెండ్సే అంకుల్‌ 2017లో ప్రారంభించారు. ఇక్కడ ఎన్నో పాతకాలం నాటి సైకిళ్లు, రిక్షాలు, పెడల్‌ కార్లున్నాయి. కేవలం ఇవే కాదండోయ్‌.. పురాతన కాలానికి చెందిన దీపాలు, తాళాలు, కుట్టుమిషన్లు, గడియారాలు, రేడియోలు, టైప్‌రైటర్లు, బరువు తూచే యంత్రాలు.. ఇలా ఎన్నో సేకరించి పెట్టారు. వీటన్నింటి కోసం మూడు అంతస్తుల భవనాన్నే కేటాయించడం నిజంగా గ్రేట్‌ కదూ! ప్రస్తుతం లాక్‌డౌన్‌ కాబట్టి సందర్శకులను అనుమతించడం లేదు. కానీ మాములు రోజుల్లో అయితే జనాలతో కళకళలాడుతూ ఉండేది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని